Telugu News

ఎన్నికలు వస్తే మోడీకి యుద్ధం గుర్తొస్తది: పొంగులేటి 

బీఆర్ ఎస్ ను ప్రజలు మరిచిపోయారు

0

ఎన్నికలు వస్తే మోడీకి యుద్ధం గుర్తొస్తది: పొంగులేటి 

– బీఆర్ ఎస్ ను ప్రజలు మరిచిపోయారు
– వీవీసీ మామిడి తోట వద్ద సమావేశంలో మంత్రి పొంగులేటి
– కాంగ్రెస్ తోనే సంక్షేమం: జెట్టి కుసుమ

(ఖమ్మం-విజయం న్యూస్):

అన్ని వర్గాల ప్రజలు ధైర్యంగా ఉండాలంటే, సమ సమాజం చల్లగా ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని వీవీసీ ఫంక్షన్ హాల్ వద్ద మామిడి తోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డితో కలిసి ప్రసంగించారు. ప్రధాని మోదీకి సెంటిమెంట్లు రగిలించడం బాగా తెలుసనీ, ఎన్నికలొస్తే సరిహద్దులో యుద్ధo అంశం తెరపైకి తెస్తారని తెలిపారు. ఇలాగే రెండుసార్లు జరిగిందని.. మూడోసారైన ఈసారి ఆ ఆటలు చెల్లవని అన్నారు. కొత్తగా ఈసారి రామాలయం కట్టిచ్చాo అంటున్నారని, అక్షింతలు కార్యక్రమం పేరుతో మోసం చేయబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్లో నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు పాలన ఎంతో బాగుoడేదని అన్నారు. ఇప్పటి బీజేపీ పాలనలో అందరికీ కష్టాలే అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమలు చేయాల్సిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కేసీఆర్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక పరిస్థితి, కాకముందు పరిస్థితి చూస్తే ఎంతలా దోచుకు తిన్నాడో అర్థమవుతుందని అన్నారు.

*జిల్లాలో బీఆర్ఎస్ పాలకులు ఇబ్బంది పెట్టారు.. మేo అలా చేయo*
బీఆర్ఎస్ పాలనలో మన జిల్లాలో డాక్టర్లు, రియల్టర్లు, పెద్దలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అప్పటి పాలకులు భూకబ్జాలే ధ్యేయంగా.. అక్రమ కేసులతో ఎదురు తిరిగిన వారందరినీ హింసించారని తెలిపారు. జిల్లా మంత్రులమైన భట్టి, తుమ్మల, తాను ప్రజల కష్టాలు తీరుస్తామే కానీ.. కావాలని కష్టపెట్టబోమని అన్నారు.
*నందమూరి, వైఎస్సార్ ఎప్పటికీ స్మరణీయమే..*
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అనేక కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మంచి చేశారని తెలిపారు. ఆ రోజుల్లోనే అంతగా ఆలోచించాలని చెప్పారు. ఆ తర్వాత వైఎస్సార్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పరితపించాలని తెలిపారు. అందుకే ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేకమంది ఉన్నా.. వీరిద్దరి పేర్లే ప్రజలు తలుచుకుంటారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం: జెట్టి కుసుమ*
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అలాగే కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ప్రజలకు లబ్ధి కలుగుతుందని టీపీసీసీ నేత జెట్టి కుసుమ కుమార్ అన్నారు. కొద్దికాలంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేసిందని అన్నారు. ఖమ్మం ఎంపీగా రఘురాం రెడ్డిని ఇక్కడ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ అధ్యక్షతన జరిగిన *ఈ కార్యక్రమంలో..* మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఎం నేతలు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, యర్ర శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మాజీ కార్పొరేటర్ దీపక్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.