Telugu News

నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా

రేవంత్ రెడ్డిపై మండిపడిన ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు

0

నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా

== అంబేద్కర్ సెంటర్లో మీటింగ్ పెట్టగలవా..?

== రేవంత్ సభలో నావాళ్లే వెయ్యిమంది ఉన్నారు

== రేవంత్ పచ్చి దగులుబార్..

== పైసలతో పబ్లిక్ లో దొరికిపోయి జైలుకు పోయినోడు మమ్మల్ని విమ్మర్శించుడా.?

== నాకు 300 ఎకరాల ఎక్కడున్నాయో నిరూపించు

== నీ మీద పరువునష్టం దావా వేస్తున్న..ఇక కాచుకో..

== రేవంత్ రెడ్డిపై మండిపడిన ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు

(మణుగూరు-విజయంన్యూస్)

నేను తలుచుకుంటే అంబేద్కర్ సెంటర్లో మీటింగ్ పెట్టగలవా..? నువ్వు మణుగూరు రాగలవా..? పైసలతో పబ్లిక్ లో ఏసీబీకి చిక్కిన దొంగ నాపై విమ్మర్శలు చేయడమా..? నేను బర్రెలు కాచుకునేటోడ్నా..? 300 ఎకరాల భూమి ఉందా..? చూపించికపోదే మర్యాద ఉండదు..? నేను అమ్ముడుపోయానా..? మిమ్మల్నేందుకు వదలాలి.. మీ మీద పరువునష్టం దావా వేస్తా..? ఇప్పటి నుంచి మీ నాయకులందరిపై కేసులు పెడతాం.. ఇక కాచుకో అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, పాయo వెంకటేశ్వర్లు పై ప్రభుత్వవిప్ పినపాక శాసనసభ్యులు రేగ కాంతా రావు హాట్ కామెంట్స్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పై ప్రభుత్వ విప్ కాంతారావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నువ్వు అమ్ముడుపోయిన వ్యక్తివంటూ అమ్ముడుపోయి ఏసీబీకి అడ్డంగా దొరికావని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: రేగా అభివృద్ధి పై చర్చకు సిద్దమా..?: పాయం

కొడంగల్ ప్రజలు నిన్ను చీకొడితే అక్కడ నుంచి వెళ్లి ఎక్కడో పోటీ చేసి గెలిచావు. కొడంగల్ లో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. నేను తలుసుకుంటే అంబేద్కర్ సెంటర్లో నువ్వు సభ పెట్టే వాడివా..? మణుగురులో అడుగు పెట్టగలవా..? నీ మీటింగ్ లో నా మనుషులు వెయ్యి మంది ఉన్నారు.. ఆ రోజు నీ మీదకి రావటానికి సిద్దమైతే, నేను వద్దంటే ఆగిపోయారంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. సంస్కారం లేని వాడివి నువ్వు నన్ను గుడ్డలు ఉడా తీసి కొడతాను అంటావా..?ఎంత ధైర్యం నీకు నీ నాయకులకు, నేను అమ్ముడు పోయాను అంటావా..? నేను అమ్ముడుపోలేదు వీలీనేమయ్యాను అని అన్నారు. గాంధీ నడిపిన పార్టీలో ఉండి ప్రగతి భవన్ కూల్చేస్తావా..? పేల్చేస్తావా..?అని వల్గరగా మాట్లాడుతావా..?అని ప్రశ్నించారు. మీలాంటి వాడు నాకు నీతులు చెప్తావా..? నువ్వు చెప్తే దయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జోకర్లు తయారయ్యారైయ్యారని,

ఇది కూడా చదవండి: ఇల్లందులో మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?

2009లో కమ్యూనిస్టులు ఏలుతున్న పినపాక లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిన ఘనత రేగా కాంతారావుదేనని అన్నారు. 2014లో మంత్రిని అవుతానని నాకు టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నన్ను ఇబ్బందుల గురి చేశారు నాకు తెలుసన్నారు. నీ మీద పరువునష్టం దావా వేస్తున్న, 300 ఎకరాల ఎక్కడున్నాయో నిరూపించు లేకుంటే వదిలేది లేదన్నారు. బర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చిందని హేళన చేయడం హస్యాస్పదమన్నారు. ఇవాళ సాయంత్రం నుంచి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో మీ వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయన్నారు. ఇంకొకపక్క చేతగాని ఎద్దుని డబ్బు మదంతో బరిలోకి దించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎందుకు వస్తారు ఎందుకు వెళ్తారో తెలవదు గ్రూపులు కట్టడానికి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా పినపాక నాదే రేగ కాంతారావు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.