పాలమూరును ప్రజలు కావాలంటుంటే.. కాంగ్రెస్ వద్దంటోంది :మంత్రి హరీష్ రావు
పాలమూరు ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం
పాలమూరు ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం: హరీష్ రావు
== పాలమూరును ప్రజలు కావాలంటుంటే.. కాంగ్రెస్ వద్దంటోంది :మంత్రి హరీష్ రావు
(ఖమ్మం -విజయం న్యూస్)
పాలమూరు ప్రాజక్టు మహుబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శాశ్వత పరిష్కారమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో మహుబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు తోపాటు పలు ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇది కూడా చదవండి:- పనోల్లు కావాలా, పగోల్లు కావాలా: హరీష్ రావు
కానీ సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్ట్ లను భారీ బడ్జెట్ ను విడుదల చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చేశారని, తద్వారా లక్షల ఎకరాల వ్యవసాయభూములకు సాగునీటిని అందిస్తున్నారని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ ఘనతేనని అన్నారు.పాలమూరు ప్రాజెక్టు ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు సిద్దమైతే ప్రతిపక్ష పార్టీలు శకుని పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గతంలో అనేక దఫాలుగా ప్రాజక్టులపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, ట్రిబ్యునల్ వద్ద ఫిర్యాదుల చేస్తారని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను అపేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులను ప్రజలు పండగ లా భావిస్తే, ప్రతిపక్షాలు దండగ అంటున్నాయని ఆరోపించారు. పాలమూరు ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు అని, కాళేశ్వరం కంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ దండగ అంటున్న పార్టీలు దండగ అంటూ ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. నాడు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి:- ఎమ్మెల్సీ కవితా కు ఈడీ నోటీసులు
మీరు పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని విమ్మరించారు. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు స్రుష్టించినప్పటికి సీఎం కేసీఆర్ సంకల్ప బలం కిందా తుత్తినియం కావడం ఖాయమన్నారు. ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సాధనధీక్షతతో పనిచేస్తాడని, అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చిన పాలమూరును పూర్తి చేసుకుని శుక్రవారం ప్రారంభించబోతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి:- అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు శుభవార్త.