Telugu News

పొంగిలేటి పై అసత్య ఆరోపణ చేస్తే ఉపేక్షించేది లేదు

విలేకరుల సమావేశంలో కోరం వర్గీయులు

0

పొంగిలేటి పై అసత్య ఆరోపణ చేస్తే ఉపేక్షించేది లేదు

– ఓటమి తేటతెలమైంది అందుకే ఆరోపణలు

– ప్రజాభిమానం పోటెత్తింది

– విలేకరుల సమావేశంలో కోరం వర్గీయులు

(ఇల్లెందు-విజయం న్యూస్)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలపై ఆవాకులు చవాకులు చేస్తే సహించేది లేదని కోరం వర్గీలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కోరం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలతో ఎవరి బలం ఏంటనేది స్పష్టమైందన్నారు. అసత్య, అబూత కల్పన వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు.  సుమారు పదివేల మంది ప్రజానికం కోరం, శీనన్న నినాదాలతో సభ ప్రాంగణానికి తరలివచ్చారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇల్లెందులో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఒక సాదాసీదా నాయకుడికి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి రావడం చరిత్రలో లేదన్నారు. ఇల్లందు పట్టణంలో గల జెడ్పీ, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పై ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, టీజీబీకేఎస్ నాయకుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కోరం కనకయ్య ఎమ్మెల్యే గా గెలుపొంది నియోజక అభివృద్ధి కోసమే తెరాసా తీర్థం పుచ్చుకున్నారన్నారు. 2014 ఎన్నికల సమయానికి నియోజక వర్గంలో అట్టడుగున ఉన్న తెరాసా ఓటు బ్యాంకును 2018 ఎన్నికల నాటికి 69 వేల పైచిలుకు బలమైన ఓటు బ్యాంకుగా మలిచిన ఘనత కోరం కనకయ్యకే దక్కిందన్నారు. అంత ముందు కేవలం 23,000 ఓట్లే ఉన్నాయన్నారు. జెడ్పీ నిధులతో జిల్లాలోని వివిధ మారుమూల ప్రాంతాలతో పాటుగా ఇల్లెందు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండటంతో ఓపక్క నియోజకవర్గ ప్రజలు కనకయ్యకి బ్రహ్మరథం పడుతుండటం, మరోపక్క ఉమ్మడి జిల్లాతో పాటుగా ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన అనేక బీద, బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాలతో పాటుగా,కుల మతాలకతీతంగా చర్చీ, దేవాలయాలు, ఈద్గా లాంటి ప్రార్థనా మందిరాల నిర్మాణాలకు సహాయ సహకారాలు,ఆడబిడ్డల కళ్యాణానికి నూతన వస్త్రాలు అందిస్తున్నారని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక బీద,బిక్కి కుటుంబాలకు తమ వైద్యశాల నందు ఉచిత చికిత్స నిర్వహిస్తుండటంతో, నియోజకవర్గం నలుమూలల నుంచి పొంగులేటి, కోరం లకు ఘన స్వాగతాలు పలుకుతుండటంతో ఇక చేసేదేమీ లేక రాబోవు రోజుల్లో వీరి రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసమే అర్థరహిత ఆరోపణలను చేస్తున్నారన్నారు ఆరోపించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీలు మండల రాము, పాయం కృష్ణ ప్రసాద్, పూనెం సురేందర్,మాజీ రైతు సమితి అధ్యక్షులు సువర్ణపాక సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి బిక్షం,మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్ మూతి కృష్ణ, ఇందిరా నగర్ ఉప సర్పంచ్ ఎల్లయ్య, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, గుగ్లోత్ నాగార్జున,ఎల్లయ్య,బండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?