Telugu News

స్వరాష్ట్రం సంక్షేమంతో వర్ధిల్లాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం: జావిద్

0

స్వరాష్ట్రం సంక్షేమంతో వర్ధిల్లాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం: జావిద్

👉🏻ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే ఏకైక ఎజెండ

👉🏻ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీ కి ఒ అవకాశం ఇవ్వండి

👉🏻నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

(ఖమ్మం నగరం-విజయంన్యూస్)

స్వరాష్ట్రం సంక్షేమంతో వర్ధిల్లాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు. బుధవారం హాత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం మండలంలో జింకల తండా చింతగుర్తి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చకుండా దశాబ్ది ఉత్సవాల పేరిట హంగామా సృష్టించడం సిగ్గుమాలిన చర్య అని దూషించారు.

ఇది కూడా చదవండి: *ఉపాధి కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు:జావిద్

రాష్ట్రంలో ఏ వర్గం వారిని ఆదుకున్నారో టిఆర్ఎస్ శ్రేణులు చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల దళిత బంధు ఓ దగా బందు అని దళిత బంధు పేరుతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎత్తేసారని దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న భూమి ఇవ్వకుండా మోసం చేశారని గుర్తు చేశారు. ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబాలను అవమానపరిచి భూ కబ్జాదారులకు రియాల్టర్లకు మంత్రి పదవులు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కాలంలో కొన్ని తరాలకు తీరని అక్రమాలు చేశారని ఆరోపించారు. కర్ణాటక గెలుపు జీర్ణించుకోలేక దాన్ని మభ్య పెట్టడానికే 2000 రూపాయల నోటు రద్దు అంశం తెరపైకి తెచ్చారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ దేశంలో మోడీ అసలు రంగు బయట పడుతోందని వారు ఇంటికి పోయే రోజులు దగ్గరలోనే పడ్డాయని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రతి ఒక్కరు పునరాలోచించాలని తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇచ్చి సోనియమ్మ కలలు కన్నా తెలంగాణ సాధన కు కృషి చేయాలని అన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్

రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ గారు, సత్యం బాబు , మారం కరుణాకర్ రెడ్డి గారు, కొంటేముక్కుల నాగేశ్వరరావు గారు ఏలూరి రవికుమార్ గారు, వసీం, యశ్వంత్, నాని, జింకలతండ గ్రామ నాయకులు దారావత్ సక్రు, లక్పతి, రామారావు, వెంకన్న, చింతగుర్తి గ్రామ నాయకులు ఆలస్యం సూరయ్య, భూక్యా వెంకన్న, ఆలస్యం లక్ష్మయ్య, కోటయ్య, రవి, సురేష్, రామకృష్ణ, తది తరులు పాల్గొన్నారు……..