Telugu News

కల నేరవేరిన వేళ

ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ

0

కల నేరవేరిన వేళ
== ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ
== బడ్జెట్ లో ప్రకటించిన మంత్రి హారీష్ రావు
== సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు
== ఖమ్మంలో సంబరాలు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ఎన్నో ఏళ్ల కల నేరవేరింది.. హైదరాబాద్ నగరం తరువాత అత్యధికంగా వైద్యశాలలు ఉన్న ఖమ్మం జిల్లాకు వైద్యకళాశాలను మంజూరు చేయాలని అనేక సంవత్సరాలుగా కోట్లాడుతున్నప్పటికి ఫలితం లేకపోయింది.. కానీ తెలంగాణ ప్రభుత్వం 2022 బడ్జెట్ సందర్భంగా ఖమ్మం జిల్లాలకు వైద్యకళాశాలను మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను వైద్యశాఖపై ద్రుష్టి పెట్టగా అందులో భాగంగానే అన్ని సౌకర్యాలు కల్గిన ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ అవసరమని భావించిన సీఎం కేసీఆర్ సర్కార్ ఈ మేరకు మంజూరు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు.

also read :-నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.

సోమవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి హారీష్ రావు వైద్యం విషయంలో ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలకు వైద్య కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మంతో పాటు మహుబూబ్ నగర్, నల్గొండ, సూర్యపేట, సిద్దిపేట జిల్లాల్లో వైద్యకాలేజీలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు, మంత్రి హారీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు బుకేలు అందించి క్రుతజ్జతలు తెలిపారు.

also read :-మేమున్నాం అంటూ అండగా నిలిచిన సీఐ బ్యాచ్ మెంట్స్.
== మెడికల్ కాలేజీ మంజూరు పట్ల సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి
ఖమ్మం జిల్లాకు నూతన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి బడ్జెట్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవతో ఖమ్మం జిల్లా కు మెడికల్ కాలేజీ మంజూరు కావడం పట్ల మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసిఆర్ నేతృత్వంలో వైద్యసేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ, దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి అజయ్ చెప్పారు. అలాగే ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్యలు కలిసి సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.
== ఖమ్మంలో సంబరాలు
ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం పట్ల ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఆసుపత్రి ఉధ్యోగులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట, పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణి చేసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మిప్రసన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ జేసీ క్రిష్ణ, నగర కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు.