Telugu News

రైతులను ముంచితే మీరు మునుగుతారు.

 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

0

రైతులను ముంచితే మీరు మునుగుతారు
 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
 అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ధాన్యం కొనుగోలు విషయంలో మాయమాటలో మోసపూరితంగా వ్యవహరిస్తూ రైతులను ముంచితే.. ఆ రైతులే మిమ్మల్ని ముంచేస్తారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, జనజగరణ యాత్ర ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ సమీర్కర్ అన్నారు. ఎ.ఐ.సి.సి,టీ.పి.సి.సి. సిలుపుమేరకు, రాష్ట్రంలో వరి ధాన్యం పంటకు మద్దతు ధర ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి వెంటనే చెల్లంపులు చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా హాజరైన వారు మాట్లాడుతూ వానాకాలం వరిధాన్యం కల్లాల్లోకి వచ్చాయని, వాటిని కొనే నాథుడే కరువైయ్యారని ఆరోపించారు. తద్వారా అకాలంగా కురుస్తున్న వర్షాలకు రైతులు పండించిన ఆరుగాల పంట నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాల పంట గురించి మాట్లాడమంటే యాసంగి పంట గురించి రెండు ప్రభుత్వాలు ధర్నాలకు దిగడం హస్యాస్పదంగా ఉందన్నారు.

రైతుల సమస్య అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంత నవ్వులాటగా ఉందా..? అని ప్రశ్నించారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై, కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొస్తే 20 రోజులు గడుస్తున్నప్పటికి కొనే నాథుడే కరువైతే, ఆ రైతు రోజుల తరబడి వడ్ల వద్ద కాపల కాస్తుంటే రైతు గురించి పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు రోడ్డేక్కి మీరంటే మీరే అంటూ ధర్నాలు చేస్తుండటం హాస్యస్పధంగా ఉందన్నారు. రైతుల బాధలు తీర్చాల్సిన ప్రభుత్వాలు రోడ్డేక్కి కొట్టుకుంటుంటే ఒక రైతులు ఏ ప్రభుత్వానికి చెప్పుకోవాలో అర్థం గాకా నెత్తిమీద గుడ్డ వేసుకునే పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయని ఆరోపించారు. రైతులను ముంచేందుకు రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, అదే జరిగితే రైతులే దర్జాగా ఆ ప్రభుత్వాన్ని గోదావరిలో ముంచేయడం ఖాయమన్నారు.

ఇప్పటికైనా కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పంటను కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.అనంతరం ప్రతినిధి బృందం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ యం.ఎల్.సి. అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,

జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా ఎస్.సి. సెల్ అధ్యక్షులు బొడ్డు బొండయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ , మద్ది శ్రీనివాస్ రెడ్డి, వనం ప్రదీప్ చక్రవర్తి (బాబు), ఖమ్మం నగర కార్పోరేటర్లు లతావత్ సైదులునాయక్ , పల్లెబోయిన చంద్రం, మధిర బి-బ్లాక్ అధ్యక్షులు కన్నెబోయిన గోపీ యాదవ్ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు కల్లెం వెంకటరెడ్డి, గింజల నర్సిరెడ్డిగారు, ముట్టె గురవయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెండ్ర అంజయ్య, తోటకూర రవి శంకర్, మద్దినేని రమేష్, సయ్యద్ హుస్సేన్, మద్ది వీరారెడ్డి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ యాసిన్, మామిడి వెంకన్, ఏలూరి రవి, జెర్రిపోతుల అంజనీ, బచ్చలకూర నాగరాజు, బోయిన వేణు, పొదిల హరినాథ్, దాసరి వెంకన్న, బెల్లంకొండ శరత్, సైదులు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

also read :- సింగరేణిలో మోగిన సమ్మె సైరన్