Telugu News

ప్రభుత్వం తొందరగా స్పందించి ఉంటే నష్టం జరిగేది కాదు:సీతక్క

0

ప్రభుత్వం తొందరగా స్పందించి ఉంటే నష్టం జరిగేది కాదు:సీతక్క

(ములుగు-విజయం న్యూస్)

ససకాలంలో సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉంటే ప్రజలకు ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కావని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు బాగా వస్తున్నాయి హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని, ఎన్టీఆర్ బృందాలను పంపించాలని ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించలేదని, అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, జనం కొట్టుకొని పోయిన తర్వాత హెలికాప్టర్లు పంపిస్తామంటూ గారడి మాటలు చెప్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ములుగు జిల్లా మేడారం వద్ద జంపన్న వాగు పొంగిపొర్లుతుండతో ఆ వరద ఉధృతికి కొన్ని ఊర్లకుఊర్లూ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదలు చిక్కుకున్నారు. వారిని కాపాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో వరదల చిక్కుకున్న గ్రామాలను బోట్లు సహాయంతో వెళ్ళి పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ పై మండిపడ్డారు.జపన్న వాగు ఉదృతంగా ప్రవహించడం తో సుమారు 20 గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఉందన్నారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తొందరగా స్పందించి ఉంటే ఎంత నష్టం జరిగేది కాదన్నారు.కొండాయి, మల్యాల, దొడ్ల, చల్పాక, ఆల్లం వారి ఘనపురం గ్రామాలలో పర్యటించి ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించిన సీతక్క, గోదావరి ప్రవాహంలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలలో పాల్గొన్న ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క.బోట్ సహాయంతో వాగు దాటి ప్రజలను పరామర్శించి, అంతక్రియలలో పాల్గొన్న ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క, ఎన్.డి.ఆర్.ఎఫ్ రిస్క్ టీమ్ సహాయంతో గల్లాంతైనా 8 మృతదేహలు వెలికితిసి, మృతదేహలను వాగు దాటించారు.నిత్యావసర సరుకులు పంపిణీ సహాయక చర్యలలో సహాయం అందించిన కాంగ్రెస్ శ్రేణులు,  అపారనష్టం వాటిల్లింది ప్రభుత్వం బాధితులందరికి 5లక్షల రూ నష్టపరిహారం అందించి ఇళ్ల్లు నిర్మించాలని, మృతుల ప్రతి కుటుంబానికి 25లక్షల రూ ఆర్థిక సాయం అందించాలి డిమాండ్ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,జిల్లా అసెంబ్లీ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న ,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,
మండల అధ్యక్షులు చిటమట రఘు,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత-దేవేందర్ , జిల్లా మైనారిటీ సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య,మండల ఉపాధ్యక్షులు ఎండి రియాజ్ , కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండీ అప్సర్, కన్నాయిగూడెం మండల ఇన్చార్జి జాడి రాంబాబు,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,పిఏసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్,జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్ కుమార్ (సర్పంచ్ )మండల మైనారిటీ అధ్యక్షులు సిరాజ్,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,మండల బి సి సెల్ అధ్యక్షులు కుదురుపాక శ్రీనివాస్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి గద్దల నవీన్,సీనియర్ నాయకులు సాధనపెళ్లి లక్ష్మయ్య,టౌన్ ఉపాధ్యక్షులు మామిడి రాంబాబు,మండల సహాయ కార్యదర్శి ముమ్మనేని రమేష్,సునార్కని శ్రీనివాస్,నేగారికంటి ముతేష్,ముద్రబోయిన రఘు, కంభం రాజేష్,జర్పుల అమృత,యూత్ నాయకులు ముస్తఫా,నాగవత్ కిరణ్,గాయాజ్,లక్ష్మణ్,నూతి లక్ష్మణ్,కర్ల తరుణ్,పెద్ది రాజబాబు, సర్వ సాయి, సాంబ, మనోహర్, జగన్, ఖుషి కుమార్, ఖయ్యుమ్, తోట ప్రశాంత్,శ్రవణ్,రమేష్, సునీల్, వంశీ, సాయిరాం, సంపత్,గణేష్, జగన్, సద్దాం,ఠాగూర్,జిమిడా కళ్యాణ్,కొండాయి గ్రామ ఉపాధ్యక్షులు పరికి నర్సింహారావు,పరికి ప్రసాద్, కుక్కల రాములు,ముద్రబోయిన రఘు, మాదరి రమేష్,ఫారూక్, బండ రమేష్,పరికి బిక్షపతి,తిప్పనాపెళ్ళి రవీందర్, మందపెల్లి నవీన్, కొగిల రాజు,గోగు నాగరాజు, ఎండీ అక్బర్,దావుద్ భాయి,జిమ్మీడ రవి,డోంగిరి ప్రకాష్,కొండగొర్ల నర్సింహులు,కుమ్మరి సంతోష్,సునార్కని సురేందర్,గాందర్ల నర్సింహారావు, కటకం మల్లయ్య,తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.