Telugu News

పేదలు ప్రశ్నిస్తే దాడి చేస్తారా..?: జావిద్

కార్పోరేటర్ పై బీఆర్ఎస్ నాయకుల దాడికి ఎవరు సమాధానం చెప్పాలి

0

పేదలు ప్రశ్నిస్తే దాడి చేస్తారా..?: జావిద్

== కార్పోరేటర్ పై బీఆర్ఎస్ నాయకుల దాడికి ఎవరు సమాధానం చెప్పాలి

== సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

== విలేకర్ల సమావేశంలో ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు జావిద్

(ఖమ్మం-విజయంన్యూస్)

నిరుపేదలకు ఇండ్లు రాలేదని, ఇండ్ల పంపిణిలో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని మహిళలు మంత్రిని అడిగే ప్రయత్నం చేస్తే ఆ బాధిత మహిళలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది దేశ సమాజానికే సిగ్గుచేటని ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు, పిసిసి సభ్యులు మహ్మద్ జావేద్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

ఇది కూడా చదవండి:-;నిగ్గదీస్తే దాడి చేస్తారా…?: పొంగులేటి

గత కాంగ్రెస్ ప్రభుత్వం లో వైఎస్ఆర్ కాలనీ లో 5వేల ఇండ్లకు పట్టాలు ఇచ్చారని, ఆ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా ఎన్నికైన సైదులు నాయక్ పై కక్ష సాధింపు చర్యలలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కావాలనే బుధవారం  ఇళ్ల పట్టాల పంపిణీ లో దాడి చేయించారని ఆరోపించారు. అవకతవకలు జరిపి మాకు న్యాయం జరిగేలా చేయాలని ప్రాధేయ పడుతున్న కార్పొరేటర్ పై, నిరుపేద ఎస్సీ,ఎస్టీ  మహిళలపై రౌడీ మూకలతో, అధికారాన్ని అడ్డపెట్టుకుని పోలీసులతో దౌర్జన్యానికి ఒడికట్టారని ఆరోపించారు. మహిళలపై, కార్పోరేటర్ పై దాడి చేయడాన్ని ఏమంటారని, ఎవరు వారిపై చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో బెదిరింపులు కాంగ్రెస్ చూసిందని, వారి ఆటలు ఇక ముందు సాగవని ఖమ్మం నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:-;ఖమ్మంలో మంత్రికి షాక్..ఎందుకంటే..?

  ఇది ఏమిటీ అని ప్రశ్నించిన కార్పొరేటర్ మీద మంత్రి అనుచరులు, పోలీస్ యాత్రంగం దౌర్జన్యానికి పాల్పడి, దాడికి దిగారు. అర్హులు కల్గిన వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలి అని, వారికీ న్యాయం చెయ్యాలని కార్పొరేటర్ ధర్నాకు దిగారని అన్నారు.  ప్రజాస్వామ్య భారతదేశంలో న్యాయం కోసం, ప్రజలు  ప్రశ్నిస్తే, అధికార దాహంతో జిల్లా మంత్రి, పోలీస్ ఆదికారులను అడ్డుపెట్టుకొని దాడికి పోల్పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంతరం బాధితులు జ్యోతి, కందుల బుచ్చి బాబు, రమా, సోనీ లు మాట్లాడుతూ రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైతం మంత్రి ఆదేశాలతో పేద ప్రజలపై విచక్షణా రహితంగా వ్యవరించారని పాత్రికేయులు ముందు వాపోయారు.

ఇది కూడా చదవండి:- నువ్వేదో పొడుస్తావని నిన్ను  గెలిపించలేదు: పొంగులేటి

ఈ ప్రెస్ మీట్ లో కార్పొరేటర్లు డుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, రఫేదా బేగం, పల్లెబోయిన భారతి చంద్రం, మిక్కిలినేని మంజుల నరేందర్, కొప్పెర సరితఉపేందర్,జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, ముస్తఫా,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్, స్వరూప, కొత్తపల్లి పుష్ప, నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నగర ఐఎన్టీయుసీ అద్యక్షులు నరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.