Telugu News

ఇక్కడ ప్రమాదం జరిగితే భాద్యులేవరు…?

గేట్ వాల్వ్ కోసం గుంత తవ్వారు..వదిలేశారు..!

0

ఇక్కడ ప్రమాదం జరిగితే భాద్యులేవరు…?

గేట్ వాల్వ్ కోసం గుంత తవ్వారు..వదిలేశారు..!

నెలలు గడుస్తున్నా పట్టించుకోరు..!

(మహబూబాబాద్- విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా చిన్న గుడూరు మండల కేంద్రంలో గేట్ వాల్వ్ గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి.దాశరధి సెంటర్ నుంచి దాశరధి గ్రంధాలయం వరకు వెళ్లే ప్రధాన వీధి మధ్యలో పంచాయితీ సిబ్బంది గేట్ వాల్వ్ కోసం తీసిన గుంత పూడ్చకుండా వదిలేయడం తో అందులో ఎప్పుడు ఎవరు పడి ప్రమాదానికి గురి అవుతారోనని స్థానికులు భయపడుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా లక్షలాది రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంటే స్థానిక పంచాయితీ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

also read :-తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.

గుంత తీసి నెలలు గడుస్తున్నా దాన్ని పూడ్చక పోవటంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఆ వీధి గుండా అనేక మంది వాహనాలు,మనుషులు వారి వారి అవసరాలకు ప్రయాణం సాగిస్తారు.ప్రమాదవశాత్తు చిన్న పిల్లలు అటు వైపు వెళ్తే ఎలా అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గేట్ వాల్వ్ కోసం తీసి పూడ్చకుండా వదిలేసిన గుంతను పూడ్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.