Telugu News

కమ్యూనిస్టుల జోలికి వస్తే తాట తీస్తాం: కూనంనేని

రాష్ట్రంలో బిజెపిని ఓడించడమే ప్రధాన లక్ష్యం

0

కమ్యూనిస్టుల జోలికి వస్తే తాట తీస్తాం: కూనంనేని

== రాష్ట్రంలో బిజెపిని ఓడించడమే ప్రధాన లక్ష్యం
== అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి
== గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి
== సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ఏన్కూరు, డిసెంబర్ 2(విజయం న్యూస్):

మతతత్వ పార్టీ బిజెపిని ఓడించడమే తమ ప్రధాన లక్షమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ఏనుకూరులో ఆ పార్టీ వైరా నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5 మండలాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావుకు, పువ్వాడ నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు.

ఇది కూడా చదవంఢి: కన్నీటి పర్వంతమైన సీఎల్పీనేత

అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ పరిస్థితులను బట్టి అంశాల వారీగా టిఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని, ఒకవేళ పొత్తు ఉన్న లేకపోయినా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం పైన దృష్టి పెడతామని, అందుకు పాదయాత్రలు సైతం నిర్వహిస్తామన్నారు. కమ్యూనిస్టు పార్టీలు అమ్ముడుపోయే పార్టీలు అని ఎవడైనా అంటే వారి తాటతీస్తామని కూనంనేని హెచ్చరించారు. మెడలు వంచి, కొమ్ములు విరిచి పోరాటం చేసే వీరులం కమ్యూనిస్టులం అని అన్నారు. కేంద్రంలోని బిజెపి పాలకులు ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నాయని, రాజ్యాంగ వ్యవస్థలను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నాయని, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చి వేస్తున్నాయని, మతతత్వ పార్టీలకు ఇక్కడ చోటు లేదని అన్నారు. బిజెపిని ఓడించటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తమను అరెస్ట్ చేసినప్పుడు స్పందించని గవర్నర్ షర్మిల విషయంలో ఎలా స్పందించిందని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని అన్నారు. గవర్నర్ తన పరిధి దాటిపోయారని విమర్శించారు. ఈ సభలో సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, మహమ్మద్ మౌలానా, దొండపాటి రమేష్, దండి సురేష్, విజయబాయి, ఎర్ర బాబు, జాగర్లమూడి రంజిత్ కుమార్, అమరనేని వీరభద్రం, మేడ భూషయ్య, సీతామహాలక్ష్మి, శివకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ పై నరేంద్ర మోడీ కుట్రలు మానాలి: కూనంనేని