నీ సవాల్ ను స్వీకరిస్తున్నాం… జెడ్పీసెంటర్ కి రండి…
నీ సవాల్ ను స్వీకరిస్తున్నాం... జెడ్పీసెంటర్ కి రండి... మీరా... మేమా..? అనేది తేల్చుకుందాం
నీ సవాల్ ను స్వీకరిస్తున్నాం… జెడ్పీసెంటర్ కి రండి…
== మీరా… మేమా..? అనేది తేల్చుకుందాం
== పొంగులేటి సైగ చేస్తే మా సత్తా చూపిస్తాం…!
– నవతెలంగాణ పార్టీలో చేరి కేసీఆర్ ని బండ బూతులు తిట్టిన సందర్భాలు మర్చిపోయావా..?
– నీ సవాల్ ను స్వీకరిస్తున్నాం… జెడ్పీసెంటర్ కి రండి… మీరా… మేమా..? అనేది తేల్చుకుందాం
– దొంగ గ్రానైట్ రాళ్లు తీసుకువస్తూ పట్టుబడ్డ రోజులు మర్చిపోయావా…?
– శ్రీనివాస రెడ్డి పేరును కూడా ఉచ్చరించే అర్హత నీకు లేదు
– విలేకరుల సమావేశంలో ఉప్పల వెంకటరమణపై నిప్పులు చెరిగిన పొంగులేటి అనుచరులు
(ఖమ్మం-విజయంన్యూస్):
ఎవరెన్ని కారుకూతలు కూసిన…. శీనన్న ఆదేశాల మేరకే మేము స్థబ్దతగా ఉంటున్నాం… ఎంతమంది ఎన్ని విమర్శించినా చిరునవ్వుతో తీసిపారేసే నేత మా శీనన్న…. అన్న ఓ సైగ చేస్తే మా సత్తా చూపిస్తాం… ఆయన దయతో బతికిన వారు ఎందరో ఇప్పుడు ఆయన ఎదుగుదలను ఓర్వలేక విమర్శిస్తున్నారు… ఖబడ్డార్ ఉప్పల వెంకటరమణ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ పొంగులేటి అనుచరులు, మలిదశ ఉద్యమకారులు జారె ఆదినారాయణ, బచ్చల పద్మాచారి, చీకటి కార్తీక్, యువనేత గోపి లు ఉప్పల వెంకటరమణ పై నిప్పులు చెరిగారు. పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు పొంగులేటి ఓ కాంట్రాక్టర్… న్యాయబద్దంగా సంపాదించిన డబ్బునే ప్రజాసేవకు వినియోగిస్తున్నారన్నారు….. ఆయన సంపాదన నైతికమైనదే… ఆయన నైతికతను గురించి మాట్లాడే హక్కు ఉప్పల వెంకటరమణకు లేదు అని తెలిపారు. రాజస్థాన్, ఒరిస్సాల నుంచి దొంగ గ్రానైట్ రాళ్లు తీసుకువస్తూ పట్టుబడ్డ రోజులు మర్చిపోయాడా..? అంటూ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: పొంగులేటి ఖబర్దార్!
నవతెలంగాణ పార్టీలో చేరి కేసీఆర్ ని బండబూతులు తిట్టిన సందర్భాలు ఆయనకు గుర్తులేవా అని విమర్శించారు. పదవి వ్యామోహంతో ఇప్పుడు కేసీఆర్ ని పొగుడ్తున్నావ్ అనేది వాస్తవం కాదా అని ఆరోపించారు. శీనన్న పాత బిల్లుల కోసం… కొత్త కాంట్రాక్టుల కోసం కేసీఆర్ ని కలిశారు తప్ప జిల్లా అభివృద్ధి కోసం కాదు అని విమర్శించారు. మీ సవాల్ ను స్వీకరిస్తున్నాం… జెడ్పీసెంటర్ కు మీరు రండి.. మేము కూడా వస్తాం…. మీరా… మేమా…? అనేది తేల్చుకుందాం అన్నారు. శీనన్న ఎంపీగా ఉన్నప్పుడు. నూటికి నూరు శాతం నిధులు ఉమ్మడి జిల్లా అభివృద్ధికే ఖర్చు చేశాడని, కావాలంటే ఆధారాలు చూపిస్తాం రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీనివాస రెడ్డి పేరును కూడా ఉచ్చరించే అర్హత లేని వ్యక్తివి నువ్వు… నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు… లేకపోతే శీనన్న అభిమానులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉప్పల వెంకటరమణ అస్సలు ఉద్యమకారుడే కాదని…. ఉద్యమకారుడు అయ్యి ఉంటే ఇటీవల పాల్వంచ లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆమరణ దీక్షకు మద్దతు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. ఆయన గ్రానైట్ వ్యాపార కార్యకలాపాలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ లో కొనసాగుతున్నాడని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మధ్య పెడుతున్నారంటూ… ప్రజలకు, జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే పొంగులేటి మీద నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఇది మానుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదికూడ చదవండి: పొంగులేటి మాటే మా బాట…!