Telugu News

నీళ్లు అడిగితే ‘ఉచ్చ’ పోసుకోమన్నోళ్లు కావాలా..?: కందాళ

అడిగితే తిట్టేవారు కావాలా..? అడగంగానే ఇచ్చే నేను కావాలా..?

0

నీళ్లు అడిగితే ‘ఉచ్చ’ పోసుకోమన్నోళ్లు కావాలా..?: కందాళ

== అడిగితే తిట్టేవారు కావాలా..? అడగంగానే ఇచ్చే నేను కావాలా..?

== నేను మీ లోకల్ బిడ్డను..

● మన నియోజకవర్గ ప్రజలకు పరాయి వాడి పాలన అవసరమా

● నేను అబద్ధం చెప్పనుచెప్పింది కచ్చితంగా చేస్తా

● 3కోట్ల 40లక్షలతో కొనాయిగూడెం-బోదులబండ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందాళ…

(కూసుమంచి/నేలకొండపల్లి-విజయంన్యూస్)

 మీరు పంట పొలాలు ఎండిపోతున్నాయి అని నీరు కావాలని అడిగితే ” ఉచ్చ ” పోసుకోండి అన్ని వేటకారంగా తిట్టారు కొందరు.. కానీ నేను అడగకముందే ప్రజల సమస్యలను తెలుసుకుని అవసరం ఉన్నప్పుడళ్లా నీళ్లు ఇచ్చానని, ఉచ్చ పోసుకొండి అని చెప్పిన నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని, అలాంటివారు కావాలా..? మీరు అడిగిన ప్రతిసారి నీరు విడుదల చేసిన నేను కావాలా..మీరే తేల్చుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి:- తుమ్మల.. దమ్ముంటే నా మీద పోటీ చేయ్:కందాళ

తుమ్మల నాగేశ్వరరావు  మంత్రిగా ఉన్న సమయంలో గట్టుసింగారం గ్రామంలో గ్రామస్థులు చెరువులోకి నీళ్లు కావాలని అడిగితే ఉచ్చ పోసుకోండి అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ విషయంను మరోసారి గుర్తు చేస్తూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో 3కోట్ల 40లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే కొనాయిగూడెం,కొరట్లగూడెం నుండి బోదులబండ వరకు నిర్మించే బీటీ రోడ్డుకు పాలేరు ఎమ్మెల్యే  కందాళ ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను పాలేరు నియోజకవర్గ బిడ్డను అని, పాలేరు ప్రజల కోసం ఏదైనా చేసేందుకు వెనకడం లేదన్నారు.

ఇది కూడా చదవండి:-:యువత దేశానికి వెన్నుముక : ఎమ్మెల్యే కందాళ

ప్రజలు అడిగిన, అడగకపోయిన వారి సమస్యలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రతి చిన్నవారిని కూడా గౌరవంగా చూశానని అన్నారు. కానీ కొందరు నాయకులు రాజకీయ పదవులే రాచరికంలా ఫీల్ అవుతున్నారని, ప్రజలు బానిసలుగా చూస్తున్నారని అన్నారు. అందుకే ఏం అడిగిన బూతులు తిట్టే సంస్కతి నాది కాదన్నారు. నేను అబద్దాలు చెప్పనని, చెప్పింది కచ్చితంగా చేసి చూపిస్తానని హామినిచ్చారు. నేను లోకల్.. మీ బిడ్డను.. మన నియోజకవర్గంలో పరాయివాళ్ల పాలన అవసరమా..? అని ప్రశ్నించారు. ప్రజలందరు ఆలోచించి ఓట్లేయాలని కోరారు. 

ఇది కూడా చదవండి:- తెలంగాణ ప్రజలకు అండా… కేసిఆర్ గులాబీ జెండా..:మంత్రి