Telugu News

నరేంద్రమోడీని ప్రశ్నిస్తే కేసులే: రాహుల్

బీజేపీది రెచ్చగొట్టే తత్వం..కాంగ్రెస్ ది ప్రేమను పంచే తత్వం: రాహుల్

0

నరేంద్రమోడీని ప్రశ్నిస్తే కేసులే: రాహుల్

== బీజేపీది రెచ్చగొట్టే తత్వం..కాంగ్రెస్ ది ప్రేమను పంచే తత్వం: రాహుల్

== పేదల కోసం కాంగ్రెస్ తలుపులు తెరిచి ఉంటాయి

== నరేంద్రమోడీ, అంబానీ దేశాన్ని లూటీ చేస్తున్నారు

== విజయభేరి సభలో మోడీపై రాహుల్ విమ్మర్శలు

(హైదరాబాద్-విజయంన్యూస్)

దేశ ప్రధాని నరేంద్రమోడీని ఎక్కడైనా ప్రశ్నిస్తే కచ్చితంగా వాళ్లపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయిస్తున్నారని, పార్లమెంట్ లో నేను ప్రశ్నించినందుకే అక్రమ కేసును బనాయించి బయటకు నెట్టేశారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హైదరాబాద్ లోని తుక్కగూడెలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరేంద్రమోడీ దేశ సంపదను ఆధాని, అంబానిలకు కట్టబెడుతున్నారని, వ్యాపారాలతో లాభం చేకూరుస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అధానికి ప్రతి వ్యాపారం ద్వారా లాభం చేకూరుస్తున్నారని, నరేంద్రమోదీ చేయబట్టి ప్రపంచంలోనే అధాని  నెంబర్ వన్ దనవంతుడైయ్యాడని పేర్కొన్నారు. నేను పార్లమెంట్ లో మోడీ, అధాని గురించి మాట్లాడితే స్వీచ్ బంద్ చేశారని.. పార్లమెంట్ నుంచి బయటకు నెట్టేశారని ఆరోపించారు. అయినప్పటికి బయట ఉండి నరేంద్రమోడీ, అధాని అస్తులపై, వారిద్దరి స్నేహంపై ప్రశ్నించానని అని అన్నారు. ప్రభుత్వం మారిన తరువాత వారిద్దరిది ఏరకమైన దోస్తినో తెలుస్తామన్నారు.

ఇది కూడా చదవండి: ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించిన రాహుల్ గాంధీ

నరేంద్రమోడీ ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇన్ కమ్ ట్యాక్స్, సీఐడీ, ఈడీల దాడులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని,అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. తనపై కూడా అనేక కేసులు పెట్టే ప్రయత్నం చేశారని, ఒక్క కేసు కూడా నిలబడదన్నారు. దేశ వ్యాప్తంగా అందరు ప్రశ్నిస్తుంటే అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా నరేంద్రమోడీని ప్రశ్నించారని తెలిపారు. కానీ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న నరేంద్రమోడీ సీఎం కేసీఆర్ పై, అసదుద్దీన్ పై కేసులు నమోదు కావని అన్నారు.  ఎందుకంటే నరేంద్రమోడీ, కేసీఆర్ కు ఒప్పందం ఉందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున కరెప్షన్ కు పాలుపడుతుంటే నరేంద్రమోడీ, కేసీఆర్ కరప్షన్ గురించి మాట్లాడరని,కనీసం చర్యలు తీసుకోరని ఆరోపించారు.  ఎందుకంటే నరేంద్రమోడీ, కేసీఆర్ మద్దతు దారని ముందే తెలుసుకాబట్టి చర్యలు తీసుకోరని, వ్యతిరేకంగా మాట్లాడరని అన్నారు. అంతే కాకుండా బీజేపీకి మద్దతుదారైన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని డిస్టబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు డిస్టబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు పార్టనర్స్ అనే విషయాన్ని దేశ, రాష్ట్ర ప్రజలందరు గుర్తు చేసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్

అలాగే బీజేపీ సమాజంలో విద్వేషం రెచ్చగొడితే, కాంగ్రెస్ పార్టీ అందరికి ప్రేమను పంచుతుందని, నేను చాలా సార్లు చెప్పాననని అన్నారు. ..విద్వేషం కాదు ప్రమేతో ఉండాలని.. ఆ ప్రేమ దుకాణాన్ని కాంగ్రెస్ పార్టీ తెరిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, నిరుపేదలకు,ఆదివాసులకు, వెనకబడిన వారందరికి మద్దతుగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ దర్వాజలు అందరి కోసం తెరిచి ఉంటాయని అన్నారు.