Telugu News

తుమ్మల.. దమ్ముంటే నా మీద పోటీ చేయ్:కందాళ

నీకు నా ఓపెన్ ఛాలెంజ్..చూసుకుందాం

0

తుమ్మల.. దమ్ముంటే నా మీద పోటీ చేయ్:కందాళ

== నీకు నా ఓపెన్ ఛాలెంజ్..చూసుకుందాం

== నా ప్రజలని బిక్షగాళ్లు అంటావా.. నోరు జాగ్రత్త..

== తుమ్మలకు సవాల్ చేసిన ఎమ్మెల్యే కందాళ

== కూసుమంచిలో తుమ్మల వ్యాఖ్యలపై కౌంటర్ చేసిన ఎమ్మెల్యే కందాళ

(కూసుమంచి-విజయంన్యూస్)

తుమ్మల నీకు దమ్ముంటే నా మీద పోటీ చేయ్ .. నువ్వా..?నేనా..? చూసుకుందాం..? నీకు నిజం గా ధైర్యం ఉంటే, నీ నలబై ఏండ్ల రాజకీయ జీవితానికి విలువ ఉంటే ? రా…. ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా..

ఇది కూడా చదవండి:- యువత దేశానికి వెన్నుముక : ఎమ్మెల్యే కందాళ

నీ అధిష్టానాన్ని అడుక్కొని రా.. పాలేరు లో నా మీద పోటీ చెయ్యి ?  అంటూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి తుమ్మలకు సవాల్ చేశారు. కూసుమంచి మండలంలోని మునిగేపల్లి, కేశ్వాపురం గ్రామంలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావు పలు అసక్తికర వ్యాఖ్యలు చేయగా, వాటికి స్పందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తుమ్మలకు దైర్యముంటే నాపై పోటీ చేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇన్నిరోజులు, నన్ను ఎన్ని మాటలు అన్న మౌనం గా వున్నానని రెచ్చిపోతున్నావంటూ కందాళ అగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:- నువ్వేదో పొడుస్తావని నిన్ను  గెలిపించలేదు: పొంగులేటి

నువ్వు ఇంతే, నీ నోరు అంతే అని ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు.. ఎవరినైనా అంటే ఊరుకుందును. కానీ నా ప్రజలని బిక్షగాళ్లు అంటావా.. నోరు జాగ్రత్త.. ఆపద లో వున్న వాళ్ళకి సాయం చేస్తే .. దాన్ని బిక్షం అంటావా.. ?? ఖబర్దార్ అంటూ సవాల్ చేశారు. అవసరం లో వున్న వాళ్ళకి తోడువుంటే .. వాళ్ళని  బిక్షగాళ్లు అనడానికి సిగ్గు అనిపించడం లేదా..? అంటూ దుయ్యబట్టారు. నీకు నా ఓపెన్ ఛాలెంజ్ .. దమ్ము ఉంటే.. నా మీద పోటీ చెయ్యి ? .. అప్పుడు చూద్దాం, ఎవరు బిక్షగాల్లో.. ఎవరు చైతన్యవంతులో ?? అని సవాల్ చేశారు.

ఇది కూడా చదవండి:-;లోక్ సభ అభ్యర్థిగా  ‘షర్మిళ’..ఎక్కడ నుంచంటే..?