ఐకేపీ వీవోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: డాక్టర్ రవి
వీవోఏల దీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేత డాక్టర్ రవి
ఐకేపీ వీవోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: డాక్టర్ రవి
== వీవోఏల దీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేత డాక్టర్ రవి
(ఇల్లెందు-విజయంన్యూస్)
ఐకెపి వీవోఏ ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవి డిమాండ్ చేశారు. గత పది రోజులుగా ఇల్లందు పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద దీక్ష చేస్తున్న వీవోఏల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి.. గత పది రోజులుగా ఇల్లందు పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ఆమోదించాలని కోరారు.
allso read- కాంగ్రెస్ ని విమర్శిండం సిగ్గు చేటు: పువ్వాళ్ల
గత 23 సంవత్సరాలుగా రాష్ట్రంలో 53 లక్షల మహిళల ఆర్థిక అభ్యున్నతి కొరకు పాటుపడిన , తెలంగాణ స్వరాష్ట్ర సమపార్జనలో ముఖ్య పాత్ర పోషించిన, క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు పరుస్తున్న , 22 ప్రభుత్వ శాఖల పనులను నిర్వహిస్తూ ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉన్నటువంటి వీవోఏ ల జీవితాలను తెరాస ప్రభుత్వం చాలీచాలని జీతం (నెలకు 3900 రూపాయలు) ఇచ్చి వారితో వెట్టిచాకిరి చేయిస్తూ, వారి మనోభావాలను దెబ్బతీస్తూ, గ్రేడింగ్ సిస్టం పెట్టి కొందరికి జీతం కూడా ఇవ్వకుండా వారిని రోడ్లమీద నిలుచోబెట్టిందని వారు ఆరోపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేవని, వారిని సెర్ఫ్ సంస్థలో కలిపి గౌరవప్రదమైన జీతం ఇచ్చి ఉండే వారిని వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ వారి డిమాండ్లు అయిన వీవోఏలను సెర్ఫ్ లో కలపాలని, ప్రతి నెల వారి ఎకౌంట్లలోనే రూ.26 వేల జీతం చెల్లించాలని, వారికి రూ.10 లక్షలసాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, అర్హులైన వీవోఏలను సీసీలుగా ప్రమోట్ చేయాలని, వారిపైన మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఎస్. హెచ్.జి లకు, వి.ఎల్.ఆర్ లకు అభయహస్తం డబ్బులు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
allso reaed :- రేణుకచౌదరి దమ్ముంటే నాపై పోటీ చేయ్: పువ్వాడ
పాలు అమ్మిన, పూలు అమ్మిన, కాయకష్టం చేసిన అని చెప్పుకుంటూ తిరిగే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆడబిడ్డల కష్టం తెలుసుకొని సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత కు కష్టం వస్తే ఢిల్లీకి పరిగెత్తిన మహిళా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు, మంత్రులకు వీవోఏ సోదరీమణుల కష్టాలు కనబడడం లేదా అని వారు ప్రశ్నించారు. వీవోఏ వివిధ డిమాండ్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి వారి ద్వారా అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున గళం వినిపించి వారి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవి భద్రం, మాజీ కౌన్సిలర్ ధారావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బి ఎన్ గోపాల్,పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసిక తిరుమల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కమల, పట్టణ కాంగ్రెస్ మహిళా నాయకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.