Telugu News

పాలేరు నియోజకవర్గంలో అక్రమ బియ్యం వ్యాపార దందా.

కూసుమంచి మండలం జక్కేపల్లిలో నిల్వ ఉన్న బియ్యం పట్టుకున్న కోదాడ రూరల్ పోలీసులు.

0

పాలేరు నియోజకవర్గంలో అక్రమ బియ్యం వ్యాపార దందా.

 

కూసుమంచి మండలం జక్కేపల్లిలో నిల్వ ఉన్న బియ్యం పట్టుకున్న కోదాడ రూరల్ పోలీసులు.

(కూసుమంచి-విజయంన్యూస్)

పేదలకు అందాల్సిన సర్కారి వారి బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యంను కొంత మంది ప్రజల వద్ద కొనుగోలు చేసి డీలర్ల సహాయంతో అడ్డగోలుగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. అందుకు సాక్ష్యమే కూసుమంచి మండలంలోని జక్కేపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో దొరికిని బియ్యం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలం, పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిసర ప్రాంతాల నుంచి సూర్యపేట జిల్లా కోదాడ మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్రానికి కొంత మంది వ్యాపారులు అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్నట్లు తెలిసింది. మేరకు కోదాడ రూరల్ పోలీసులు నిఘా పెట్టారు. దీంతో బుధవారం కోదాడ రూరల్ పరిధిలో కొంత బియ్యం అక్రమరవాణాను అడ్డుకోగా పోలీసులు తీగలాగారు.. దీంతో డొంక కదిలింది. కూసుమంచి మండలంలోని జక్కేపల్లిలో నకిరికంటి భాస్కరావు ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు సూర్యపేట జిల్లా కోదాడ పోలీసులకు సమాచారం అందింది. నిలువ ఉంచిన 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అకస్మీకంగా తనిఖీ చేసి పట్టుకున్నారు. కోదాడ పోలీసులు కూసుమంచి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

 

also read :-కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు చేయాలని వినతి.

also read :-మంత్రి హారీశ్‌ రావుకు కీలక బాధ్యతలు…వైద్య ఆరోగ్య శాఖ కేటాయింపు.

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*