Telugu News

ఏటూరునాగారం లో అక్రమ కలపను పట్టుకున్న పారెస్ట్ అధికారులు.

విజయం న్యూస్ -ఏటూరునాగారం)

0

ఏటూరునాగారం లో అక్రమ కలపను పట్టుకున్న పారెస్ట్ అధికారులు..

(విజయం న్యూస్ -ఏటూరునాగారం)

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లో అక్రమంగా తరలిస్తున్న విలువైన భారీ చెక్క దుంగలను పారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.. పక్కా సమాచారం తో ఫారెస్ట్ అధికారులు. సెక్షన్ ఆఫీసర్ రవీందర్, రేంజ్ ఆఫీసర్ లక్ష్మినారాయణ, బీట్ ఆఫీసర్స్ రవి, దయానంద్, శ్రీనివాస్, యాదమ్మ, అశ్విని, అనూష తదితరులు అక్రమ కలప నిలువ ఉన్న స్థలాన్ని పరిశీలించి పట్టుకున్నారు. ఆ దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పారెస్ట్ అధికారులు తెలిపారు.. వాటిని నిల్వచేసిన వారి వివరాలను తెలుసుకుంటున్నామని అక్రమ రవాణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.