Telugu News

నాడు అక్రమము నేడు సక్రమం

ఎవరి వాటా వారికి -యధావిధిగా నిర్మాణం -చేతులు తడిస్తే అంతా సక్రమమే

0

నాడు అక్రమము నేడు సక్రమం
-ఎవరి వాటా వారికి
-యధావిధిగా నిర్మాణం
-చేతులు తడిస్తే అంతా సక్రమమే

(ఉప్పల్ -విజయం న్యూస్)

నాడు అక్రమ నిర్మాణం అని కూల్చారు. నేడు ఎవరి వాటా వారికి చేరిన తర్వాత సక్రమ నిర్మాణమైంది. కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఎఫ్ సి ఐ గోదాంకు వెళ్లే రహదారికి ఇరువైపులా అక్రమ నిర్మాణాలు జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు. నాడు అక్రమ నిర్మాణం కూల్చివేసిన అధికారులు నేడు సక్రమంగా నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులకు కలిస్తే అక్రమ నిర్మాణమైన సక్రమమే అవుతుంది అంటున్నారు స్థానికులు. నిర్మాణాలను ప్రోత్సహించేది జిహెచ్ఎంసి అధికారులే? తిరిగి అక్రమ నిర్మాణం దారుల నుండి లక్షలు దండుకున్నారని విమర్శలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుండి కమిషనర్ వరకు ఎవరికి అందవలసిన వాటా వెళితే అంతా సక్రమమే అవుతుందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

also read :- మండలం లో కరోనా కల్లోలం……


అక్రమ నిర్మాణంలో ఎవరి వాటా వారిది……….
మల్లాపూర్, నాచారం డివిజన్లలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలు కాసులిస్తే కట్టుకో మంటున్నారు. కలవకపోతే నిర్మాణాన్ని కూల్చి వేస్తున్నారు. సామాన్యుడు ఇల్లు కడితే ఒక లెక్క పలుకుబడి ఉన్నవారు కడితే మరొక లెక్క పాలనలో పెద్ద వారి పేరు చెప్తే మరొక లెక్క అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ టీఎస్ ఈపాస్ తీసుకొచ్చిన అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని ప్రతిపక్ష పార్టీలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారుల ప్రోత్సాహం అందినకాడికి దోచుకోవడం అన్న చందంగా అక్రమ నిర్మాణాలు వ్యవహారం కొనసాగడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది. సాక్షాత్తు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని చెప్పిన పెడచెవిన పెడుతున్న జిహెచ్ఎంసి అధికారులు వారి జేబులు నింపుకుంటున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ ఈ విభాగంలో పనిచేస్తున్న చైనుమ్యాన్, టిపిఎస్, ఏసీపీ, కమిషనర్ స్థాయి అధికారులు అక్రమ నిర్మాణంలో సంపాదించిన అక్రమ ఆస్తులపై విచారణ చేపడితే నమ్మలేని నిజాలు వెలికి తీయవచ్చని ప్రజలు వాపోతున్నారు. అక్రమాన్ని సక్రమంగా చేయగలిగే శక్తి సామర్ధ్యాలు టౌన్ ప్లానింగ్ అధికారులుకు మాత్రమే ఉంటాయని వీరికి తోడు స్థానిక ప్రజా ప్రతినిధులు చేతులు కలపడంతో ఎవరి వాటా వారికి చేరుతుంది. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది.

 

also read :- ప్లాస్టి‌క్ భూతాన్ని….త‌రిమేద్దాం….!
స్పందించని టౌన్ ప్లానింగ్ అధికారి……..
అక్రమ నిర్మాణాలపై వివరణ కోరేందుకు కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్ ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. మీడియా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన అధికారి స్పందించకపోవడం గమనార్హం.