Telugu News

ఇల్లెందు బరిలో ‘యాకన్న’

పార్టీ ఆశీర్వదిస్తే గెలిచితీరుతానుంటున్న యాకయ్య

0

ఇల్లెందు బరిలో ‘యాకన్న’

== శీతక్క ఆశీస్సులు మెండుగా

== కీలక నేతలతో టచ్ లో

==  ఒక ప్రాణాన్ని కాపాడిన యువనేత

== అనేక సేవ కార్యక్రమాలతో ప్రజల్లోకి

== పార్టీ ఆశీర్వదిస్తే గెలిచితీరుతానుంటున్న యాకయ్య

ఇది కూడా చదవండి: సింగరేణి కాపాడుకుంటాం.:రేగా కాంతారావు

ఇల్లెందు బరిలో నేనున్నానంటూ యువనేత రంగంలోకి వచ్చారు.. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో మమైకమవుతున్నారు.. పార్టీ పిలుపులో భాగంగా అనేక సేవ కార్యక్రమాలను చేస్తూనే పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నవుతున్నారు.. అవకాశం కోసం పట్టుదలగా పనిచేస్తున్నారు.. అధినేత ఆశీస్సుల కోసం.. సీతక్క ఆశీర్వాదంతో అడుగులేస్తున్నాడు.. పార్టీ ఆశీర్వదిస్తే గెలిచి వస్తానంటున్న యువనేత ‘యాకయ్య’ పై ‘విజయం’ ప్రతినిధి ప్రత్యేక స్టోరీ

(తమ్మిశెట్టి, ఇల్లెందు-విజయం):

ఎస్టీ రిజ్వరేషన్ కల్గిన ఇల్లెందు  నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన హరిప్రియనాయక్ టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి, ఆ తరువాత రాజకీయ మార్పుల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో చేరగా,  కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానం ఖాళీ అయ్యింది.. దీంతో ఇల్లెందు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు బరిలో నిలిచేందుకు ఆరాటపడుతున్నారు.. ఇప్పటికే చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి లాంటి వారితో పాటు యువ నాయకులు కూడా ఇల్లెందు బరిలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. సేవకార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీలోని పెద్దల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఇల్లెందు నుంచి యువ నాయకుడు పెండకట్ల యాకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు రేసులోకి వచ్చారు. సీతక్క ఆశీస్సులతో ఆయన పార్టీ టిక్కెట్ దక్కించుకునేందుకు ప్రయత్నంలో నిమగ్నమైయ్యారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ బరిలో తమ్మినేని

యువ నాయకుడు.. స్నేహశీలి.. అందరికీ సుపరిచితుడు.. సేవారంగంలో రాణిస్తున్న వ్యక్తి పెండకట్ల యాకయ్య రోజురోజుకు ప్రజలలో ఆదరణ పొందుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు సేవాస్ఫూర్తిని చాటుకున్నాడు. కాంగ్రెస్ బరిలో నిలిచేందుకు గత ఐదు సంవత్సరాలుగా పోటీ పడుతున్నాడు .ఈసారి పెండకట్ల యాకయ్యకే టికెట్ వస్తుందని ఆ పార్టీ వర్గాలు ద్వారా సమాచారం ఎందుకంటే సీతక్క, రేవంత్ రెడ్డిలపైనే ఆధారపడి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు .ఇటీవల రాహుల్ జో డో  యాత్ర లో భరోసా కల్పించారు. దీంతో ఆయనకు ఊహించని ఉత్సాహం కలిగింది .నియోజకవర్గ వ్యాప్తంగా యువకులను పెద్దలను మహిళలను కలిసి సమస్యలపై చర్చిస్తున్నాడు.

ఆయన ఒక సాధారణ యువకుడు పార్టీ కార్యక్రమాలకు అంకితం అవుతారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్ని రోజులు పనిచేశాడు .కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అనేక చర్యలు చేపట్టాడు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మనలో పొందుతున్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి సీతక్క, రేవంత్ రెడ్డి వెంట ఫాలో అవుతున్నాడు. యువ నాయకుడు చూసినవారు ఉత్సాహం సేవా కార్యక్రమాలు ఉండడంతో ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. సీతక్కకు ప్రధాన అనుచరుడు బంధువు కావడంతో ఇల్లందు నియోజక వర్గం కాంగ్రెస్ టికెట్ పెండకట్ల యాకయ్య కె ఖాయం అవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అనేకమంది పోటీపడుతున్న యువకుడికే ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ నిర్దేశించినట్లు తెలుస్తుంది .ఇటీవల రేవంత్ ,సీతక్కలను కలిసి తన గ్రౌండ్ వర్క్ ను వారికి వెల్లడించారు. రాహుల్ యాత్రకు హాజరుకావాలని వారి సూచించారు.

ఇది కూడా చదవండి: ఇల్లెందు కాంగ్రెస్లో యువతేజం

వారి సూచన మేరకు జోడయాత్రలో పాల్గొని రాహుల్ కు పరిచయం అయ్యారు .స్వయంగా రేవంత్, సితక్కలే పరిచయం చేసినట్లు సమాచారం పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ యాకయ్యను ఆదేశించినట్లు తెలుస్తోంది.

== కాంగ్రెస్ ఇల్లందుకు కంచుకోట:

కాంగ్రెస్ పార్టీ ఇల్లందుకు కంచుకోట కోరం కనకయ్య, హరిప్రియలు కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ కు వెళ్లారు. ఎందుకంటే బలమైన ఓటు బ్యాంకు కాంగ్రెస్కు ఉంది .ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే కాంగ్రెస్కే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వారు యువకులకే ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ రాజకీయ పెద్దలు అధిష్టానం వద్ద దిశ నిర్దేశం చేస్తున్నారు.యువకుల పేర్లను పరిశీలిస్తే అందులో పెండకట్ల యాకయ్య పేరు ముందునట్లు తెలుస్తుంది. రాజకీయ అనుభవం సేవకుని అదేవిధంగా పార్టీ కోసం కష్టపడడం ఉండడం వల్ల ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు తనకే టికెట్ రావాలని కాంగ్రెస్ కార్యక్రమాలు పాల్గొన్నారు. అయినప్పటికీ యాకయ్య కె ముగ్గు చూపే విధంగా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి .ములుగు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాకయ్యకే ముగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే  అతి తక్కువ వయసున్న కాంగ్రెస్ అభ్యర్థిగా వెలుగులోకి రానుంది.

ఇది కూడా చదవండి: ఇల్లందులో కింగ్ మేకర్ ‘మడత’

ఈ విషయంపై పెండకట్ల యాకయ్యను దిశా వివరణ అడగగా అధిష్టానం సూచన మేరకు పని చేస్తానని స్పష్టం చేశారు. అవకాశం ఇస్తే బరిలో నిల్చుని విజయం సాధిస్తానన్నాడు. సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి ఉంటుందన్నారు. తనకు పేదరికం సమస్య  తెలుసు అన్నారు. ఆ సమస్య నుంచి గట్టెక్కించడమే తన లక్ష్యమని తెలిపారు.

== నిండు ప్రాణాన్ని కాపాడిన యాకయ్య

కాకతీయ నగర్ కు చెందిన కొండముల కృష్ణ బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. మానవ దృక్పథంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క తో మాట్లాడి 1,50,000 ఎల్ ఓ సి చెక్కును అందజేశాడు .ఈ పరిణామం పట్ల ఏరియా వాసులంతా హర్షాభిరేఖలు తెలియజేస్తున్నారు. ఇలా నియోజవర్గ వ్యాప్తంగా చాలామందికి సహాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ముందు వరుసలో ఉన్నాడు. దీంతో కచ్చితంగా పోటీ చేసి విజయం సాధించేందుకు సిద్దమైయ్యారు. అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న యాకయ్యకు టిక్కెట్ వస్తుందా..? రాదా..? వేచి చూడాల్సిందే..?