Telugu News

మద్యం దుకాణం లో బీరు తాగి వ్యక్తికి అస్వస్థత.

** ఖమ్మం ఆసుపత్రికి తరలింపు

0

మద్యం దుకాణం లో బీరు తాగి వ్యక్తికి అస్వస్థత
** ఖమ్మం ఆసుపత్రికి తరలింపు
** కల్తీ అనవాళ్లు లేవని ఉటకాయించిన అబ్కారిశాఖ

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్);-

మద్యం దుకాణం లో బీరు తాగి వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన షేక్ సైదులు(45) స్థానిక మంజునాథ వైన్స్ లో గురువారం కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ ని కొనుగోలు చేశాడు. అక్కడ కొంత దూరంలో బీరు తాగుతుండగా నోట్లో నుంచి నురగ,రక్తం వచ్చి అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ALL SO READ l- బాంచెన్ కాల్మొక్తా… గ్రామాన్ని అభివృద్ధి చేయండి..!

ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని బందువులు తెలిపారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైన్స్ షాపు నిర్వహాకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీరు తయారీలో తేడా ఉండడంతో అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇదిలా వుండగా వైన్ షాప్ గుమస్తాలు చెప్పిన మాటలు షేక్ సైదులు కొనుగోలు చేసిన బీరు నాణ్యతలో కొంతమేర వ్యత్యాసంతో మందంగా ఉందని తెలపడం గమనార్హం.

ఆబ్కారీ శాఖ వివరణ

ఈ విషయమై సంబంధిత ఆబ్కారీ శాఖ వారిని వివరణ కోరగా బీరులో ఎటువంటి సమస్యలు లేవని,అతనికి గతంలోనే అనారోగ్య సమస్యలు వున్నట్లుగా మా దృష్టికి వచ్చిందని తెలపారు.బీరులో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని బీరుకి ఇంకా ఆరు నెలల కాలపరిమితి ఉందని తెలిపారు.

also read :-యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడ కొనలేము.