Telugu News

నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: కూసుమంచి సీఐ

ఎర్రగడ్డతండాలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ

0

నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: కూసుమంచి సీఐ

== ఎర్రగడ్డతండాలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ

(కూసుమంచి-విజయంన్యూస్)

గణపతి దేవున్ని పూజిస్తున్న భక్తులందరు వినాయక నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చాలా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలని, అందరు సంతోషంతో నిమజ్జన కార్యక్రమాన్ని ముగించాలని కూసుమంచి సీఐ జితేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కూసుమంచి మండలంలోని ఎర్రగడ్డ తండా గ్రామంలో నవ యువ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డిగా గారికి కమిటీ సభ్యుల తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తెలియజేశారు శాంతియుతంగా నిమర్జనం జరుపుకోవాలని అందరూ కలిసికట్టుగా పాల్గొని విజయవంతంగా చేసుకోవాలని గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం సకాలంలో పూర్తి చేసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడ చదవండి: రోజంతా పంచుడే..పంచుడు..వామ్మో ఎన్ని పైసలో..?