Telugu News

వలస వాదుల గుప్పెట్లో కాచన వల్లి

▪️కాచనపల్లి లో జిపి లో వలసవాదుల ఆదిపత్యం

0

వలస వాదుల గుప్పెట్లో కాచన వల్లి

▪️కాచనపల్లి లో జిపి లో వలసవాదుల ఆదిపత్యం
▪️ వలసవాదులే పెట్టుబడిదారులు
▪️ ఆదివాసీలపై ఆదిపత్యం

▪️ఆదివాసి అస్థిత్వం అంతం
▪️వలసవాదులను ప్రోత్సహిస్తున్న ఎర్రజెండా పార్టీలు

(గుండాల విజయం న్యూస్)

గుండాల మండలంలో కాచనపల్లి లో వలసవాదుల ఆదిపత్యంతో ఆదివాసీలు విలవిలలాడుతు అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నారు. కాచనపల్లిలో వలసవాదులు గుప్పెట్లో రాజకీయాలు ఆర్థిక కార్యకలాపాలు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. గత 30 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం వలస వచ్చినవలసవాదులు నేడు నాలుగు ఐదు గ్రామాలను తమ గుప్పెట్లో పెట్టుకోని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఆదిపత్యం చెలాయించిన ఒక ఎర్రజెండా పార్టీ ఈ వలసవాదులను తమ పార్టీలో చేర్చుకోనివలసవాదులను విపరీతంగా ప్రొత్సహించి పబ్బం గడుపుకున్న సందర్భాలు ఉన్నాయి. మహబూబాద్ బంగ్లా ఖమ్మం మర్రిపెడాబంగ్లా కొరివి తదితర ప్రాంతాల నుండి వలస వచ్చి నేడు వందల సంఖ్యలో భూములను ఎర్రజెండా పార్టీ నీ అడ్డుపెట్టుకొని అడవులను కొట్టుకొని వందల సంఖ్యలో భూములను సంపాదించి భూస్వాములుగా అవతరించినేడు ఆ ప్రాంతాలో ఉన్న ఆదివాసీలకు పెట్టుబడి పెడుతు ఎర్ర భూస్వాములుగా అవతరించిన సందర్భాలు ఉ న్నాయి. అందులో చాల మంది అధికార పార్టీలో చేరి ఆదిపత్యం చెలాయిస్తున్న సందర్భాలు ఉన్నాయి.

also read :-వలస వాదుల గుప్పెట్లో కాచన వల్లి
కాచనపల్లిలో రోడ్డుపని కోసం వచ్చి నేడు అక్కడే స్థిరపడి వందల సంఖ్యలో భూములు సంపాదించి ఆదివాసీల అస్థిత్వంకు సపాల్ గా మారే ప్రమాదం ఉందని ఆదివాసీలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాచనపల్లిలో రోడ్డుకి ఇరువైపుల భూములను కూడ అధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు . దీనిపై రెవిన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు వలసవాదులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడ ఈ వలసవాదులను ఓటు బ్యాంకు రాజకీయ కోణంలో ఉపయోగించుకొని వాడుకున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.కాచనపల్లి అడవిలో ఉన్న భూములలో అధిక భాగం ఈ వలసవాదుల చేతులలోనే అధిక మొత్తంలో ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

also read :-నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా..

మొదటి నుండి ఇక్కడే నివాసం ఉంటున్న ఆదివాసీలు మాత్రం ఉన్న భూములకు పట్టాలు లేక అభివృద్ధికి దూరంగా పూరి గుడిసెలలో నివాసం ఉంటు దుర్భర జీవితాలు జీవిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం ఆదివాసీలకు వలసవాదులే వ్యవసాయరంగానికి పెట్టుబడులు పెడుతు అప్పుల ఊబిలో ఆదివాసీలు కూరకపోయో విధంగా చేస్తు వారిని అన్ని విదాల నిర్వాసితులు చేస్తున్నరని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వలసవాదులు గుప్పెట్లో నుండి కాచనపల్లి నీ విముక్తి చేయడానికి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ విద్యార్ధులు అతి త్వరలోనే బారీ ఎత్తున ఉద్యమం చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ వలసవాదులకు మద్దతు ఇస్తున్న బూర్జవపార్టీలు ఎర్రజెండా పార్టీలు ను ఈ ప్రాంతం నుండి తన్ని తరమడానికి ఆదివాసీ విద్యార్దుఉ లు ఆదివాసీ యువత కార్యచరణ ను త్వరలో అమలు చేయనున్నారు.