Telugu News

విద్యుత్ షాక్ తో వలసకూలి మృతి….

చండ్రుగొండ -విజయం న్యూస్

0

విద్యుత్ షాక్ తో వలసకూలి మృతి….
(చండ్రుగొండ -విజయం న్యూస్):-

విద్యుత్ షాక్ తో వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ(వలస)కూలి మరకం భాను ప్రకాష్(19)కొద్ది రోజుల క్రితం తన బాబాయ్ మరకం పత్తిరామ్ వెంట చండ్రుగొండ మండలం అన్నారంతండా గ్రామానికి వలసకూలి పనుల కోసం వచ్చారు.

also read :-జీళ్ళచేరువు శ్రీ వేంకటేశ్వర దేవస్థానం ఘనంగా గోదాదేవి కల్యాణం

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సెల్ చార్జింగ్ కోసం పొలం వద్ద ఉన్న పాకకు ఉన్న కరెంటు సరఫరాకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో 108 వాహనంలో కొత్తగూడెం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు మృతుడి బాబాయ్ పత్తిరామ్ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు