వేషగాళ్లు వస్తున్నారు..? జరజాగ్రత్త: మంత్రి
== తట్టెడు మట్టెత్తనోళ్లోచ్చి ఇక్కడ పోటీ చేస్తరంటా.?.
== ప్రజలకు మేలు చేసే ముఖాలైతే.. ప్రజలు ఆశీర్వదిస్తారు..
== కాంగ్రెస్ నేతలపై మండిపడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== నేను దేనికి భయపడను.. ఒక్క అవినీతికి తప్పా
== 75 ఏళ్ల భారతంలో ఖమ్మానికి మంత్రి వచ్చింది ఇప్పుడే
== నాలుగేళ్లలో అభివద్ది అంటే ఏంటో చేసి చూపించా
== ఖమ్మం మార్కెట్ దేశంలోనే నెంబర్ గా ఎదగాలి
== మార్కెట్ లో దళారులను ప్రోత్సహించకండి.. రైతులను ప్రోత్సహించండి
== మార్కెట్ యార్డులో లైసెన్స్ లను మంజూరు చేసిన మంత్రి పువ్వాడ అజయ్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కొంత మంది నాయకులు గజకర్ణ, గోకర్ణ వేషాలు వేసుకొని వస్తారని, వారిపట్ల ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారు వస్తే బుద్ది చెప్పి పంపించాల్సిన అవసరం ఎంతైన ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ నేతలపై ద్వజమెత్తారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు అర్హులైన వారికి మంజూరు చేసిన లైసెన్స్ ల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలుత మూడు బొమ్మల సెంటర్ నుండి పత్తి మార్కెట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.రవాణా శాఖ మంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టి నేటికీ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పువ్వాడ కు పలువురు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. భారీ గజమాలతో మంత్రి పువ్వాడను సత్కరించారు.
ఇది కూడా చదవండి: మంత్రి ‘అజయ్’ డే.. వెరీవెరీ స్పెషల్ డే..
అనంతరం లైసెన్స్ లు పొందిన 150 మందికి వారికి స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్ వరంగల్ ఎనిమావిల మార్కెట్ తో పోటీ పడుతుందని అన్నారు. మన మార్కెట్ కు పక్క జిల్లాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా సరుకు వస్తుందని, మంచి గిరాకీ కల్గిన మార్కెట్ ఖమ్మం మార్కెట్ అని అన్నారు. ఖమ్మం మార్కెట్ లో లైసెన్స్ కల్గి ఎవరైతే కుటుంబ సభ్యులు పోయారో వారికి కూడా లైసెన్సులు ఇప్పిచామని తెలిపారు. దొరెపల్లి శ్వేత చైర్మన్ అయిన దగ్గర నుండి లైసెన్సులు ఇవ్వాలని ప్రతి నిత్యం అడిగేవారని, ఇప్పుడు 150 మందికి లైసెన్స్ లు ఇస్తుంటే సంతోషంగా ఉందన్నారు.
== నేను దేనికి భయపడను.. కానీ అవినీతికి భయపడతా.
నేను దేనికి భయపడనని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, ఒక్క అవినీతికి తప్ప ఎవరికి భయపడని, నీతి, నిజాయితీగా పనులు చేసుకుంటూ వెళ్లడమే మా నాన్న నాకు నేర్పిన విద్య అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కొంతమంది ఎచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, వారి స్థాయి మరిచి అబద్ధాలు ప్రచారం చేస్తారు. కాని ప్రజలకు అన్ని తెలుసని అన్నారు. అర్హులైన వారికి మాత్రమే లైసెన్సులు ఇవ్వండి అని సూచించా. అలనే ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన వారి వద్ద నుండి అధికంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడని హెచ్చరించానని తెలిపారు. ఇతర జిల్లాలో లైసెన్స్ మంజూరులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముందుగా అర్హులైన 150 మందికి లైసెన్సులు మజూరు చేశాం.
ఇది కూడా చదవండి: సిఎం కేసీఅర్, మంత్రి పువ్వాడ కు క్షీరాభిషేకం.
మరో 20 మందికి లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. నా హయాంలో దాదాపు గా 300 మందికి లైసెన్సులు మంజూరు చేశానని తెలిపారు. లైసెన్సులు పొందిన వారు ఇతరులకు భినామీలు కాకూడదని, నేను 150 కి 150 మందికి లైసెన్సులు ఇవ్వాలని వచ్చా కానీ కేవలం 22 మందే రుసుము చెల్లించారంట.. మిగతా వారు కూడా ఆ రుసుము చెల్లించాలని అన్నారు. ఈ సంవత్సరం అకాల వర్షాల కారణంగా మిర్చి పంట ఎక్కువగా పండలేదని అన్నారు. ఒకప్పుడు కొంతమంది దుర్బుద్ధితో ఇక్కడి నుండి మార్కెట్ తరలిపోతుంది అని దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎటుబోయింది మార్కెట్ అని దుయ్యబట్టారు. ఆరోపించడానికి కనీసం ముందు వెనక ఆలోచించాలని సూచించారు. ప్రజలు కూడా పనిలేని వారు చెప్పే మాటలను నమ్మోద్దన్నారు.
== 75ఏళ్ల భారతంలో ఖమ్మం మంత్రి వచ్చింది ఇప్పుడే
75 ఏళ్ల భారతంలో ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి పదవి ఇప్పుడే వచ్చిందన్నారు. మరొక్కసారి అవకాశం వస్తె హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరం అన్నట్లుగా అభివృద్ధి చేసి చూపానని, మరింతా చూపించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ రోజు ఖమ్మం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు మంజూరు చేపించుకుని వచ్చానని, ఇప్పటికే మున్నేరుపై తీగల వంతను, మున్నేరుకు ఇరువైపుల ఆర్సీసీ వాల్ నిర్మాణానికి రూ.660 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: ఇక్కడే పుట్టా..ఇక్కడే పెరిగా: మంత్రి
ఎన్నికలు రాగానే కొంత మంది గజకర్ణ గోకర్ణ వేషాలు వేసుకొని వస్తారని, మీరంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంత అభివృద్ది చెందిన ఖమ్మం నియోజకవర్గాన్ని మళ్లీ తిరిగి వెనుకకు నెట్టాలని చూస్తారు. తస్మాత్ జాగ్రత్త అని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ భూమి పుత్రుడికి అవకాశం ఇవ్వాలని కోరారు.
పక్క ఊరు వాడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే గెలిచాడు అంటే వాడు తిరిగి వాడి ఇంటీకి వెళ్తాడని, నేను కానీ మా నాయన కానీ ఖమ్మం నియోజకవర్గాన్ని పట్టుకుని ఉన్నామి, ఎక్కడికి పోయేది లేదన్నారు. ఈ నియోజకవర్గం మా ఇల్లు.. మీరంతా నా కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నామని, ఇక్కడే పెరిగాము.. పెరుగుతామని తెలిపారు. సీఎం కెసిఆర్ ని గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించండి.
== ఎవ్వరూ అధైర్య పడొద్దు. అర్హులైన వారికి లైసెన్స్ లు ఇస్తాం: దోరేపల్లి శ్వేత
ఎవ్వరూ అధైర్య పడొద్దు. అర్హులైన వారికి లైసెన్స్ లు ఇస్తామని ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత హామినిచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్ గురించి కూడా చాలా మందికి తప్పుగా ప్రచారం చేశారని ఆరోపించారు. అభివృద్ది, సంక్షేమం పట్ల చాలా మందికి ఉన్న ఎన్నో అపోహలను తొలగించామన్నారు. అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి విడత కింద 150 మందికి లైసెన్సుల అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ముందున్నప్పటికి పేదలకు న్యాయం జరగాలన్న సంకల్పంతోనే మంత్రి పువ్వాడ గారి సూచనల మేరకు లైసెన్సులు మంజూరు చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: తుమ్మలపై మంత్రి సెటైర్.. ఏమన్నారంటే..?
మంత్రి పువ్వాడ 75 ఏళ్ల ఖమ్మం చరిత్రను తిరగరాశారు. కేవలం నాలుగేళ్లలో కనివిని ఎరుగని రీతిలో వేల కోట్లతో అభివృద్ది చేసి చూపించానని అన్నారు. నిజాయితీతో నిబద్ధతతో ఇంత పారదర్శకంగా లైసెన్సులు ఎవ్వరూ ఇవ్వలేదు.లైసెన్సుల మంజూరులో ఎటువంటి పైరవీలు లేకుండా మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ మంత్రిగా 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పాలకవర్గం, మార్కెట్ ఉద్యోగులు, వ్యాపారులు, రైతుల తరుపున మా శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో గతంలో రూ.100 కోట్లు కేటాయిస్తేనే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం.. కానీ మంత్రి పువ్వాడ అజయ్ రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి పువ్వాడ అజయ్ కే మన ఓటు. మళ్ళీ వారికి హ్యాట్రిక్ అందించాలని కోరారు.