Telugu News

రేపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలం: సీపీ

జూన్ 4 ఉదయం 6:00 గంటల నుండి జూన్ 5 వరకు కొనసాగింపు

0

రేపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలం: సీపీ

== జూన్ 4 ఉదయం 6:00 గంటల నుండి జూన్ 5 వరకు కొనసాగింపు

*లోకసభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 144 సెక్షన్ అమలు : పోలీస్ కమిషనర్

(ఖమ్మం క్రైం -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

లోక్‌సభ సాదారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా జూన్ 4 న (మంగళవారం) ఉదయం 6:00 గంటల నుండి జూన్ 5 ( బుధవారం ) ఉదయం 6:00 గంటల వరకు అంక్షాలు విధించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గుంపులుగా గుమికూడి ఉండరాదని,ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, నిర్వహించరాదని పెర్కొన్నారు.

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.

*1. ఓట్ల లెక్కింపు కేంద్రానికి 200 మీటర్ల లోపు ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం నిషేధం.*

*2. లెక్కింపు కేంద్రానికి కిలోమీటర్‌ దూరం వరకు ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు,మారణాయుధాలతో సంచరించడం నిషేధం.*

*3. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదు.*

*4. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధం*.

*5 . వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం,చట్టబద్ధమైన అధికారానికి భంగం కలిగించే లేదా ధిక్కరించే నేరానికి దారితీసే అవకాశం ఉన్న ఏదైనా ప్రసంగం నిషేధం.