పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: పోలీస్ కమిషనర్
== పకడ్భందిగా పరీక్షల నిర్వాహణ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ (నోటిఫికేషన్ నం.08/2022) పోస్టుల పరీక్షల నేపథ్యంలో అయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
టీఎస్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్, వైరా డివిజన్ పరిధిలోని మొత్తం 27 సెంటర్లు ఖమ్మం లో 22 సెంటర్లో రూరల్ లో 4 సెంటర్లలో వైరాలో 1 లో మొత్తం 9432 మంది అభ్యర్థులు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షకు హాజరు అవుతారని పోలీస్ కమిషనర్ విష్ణు తెలిపారు. అదేవిధంగా నిర్వహిస్తున్న పరీక్షాల కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఆంక్షలు అమలుల్లో వున్నందున ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు పరిక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగుల లోపు ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరిక్ష సమయంలో సమీపంలో జిరాక్స్ సెంటర్లు ముసివేయాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
ఇదికూడా చదవండి: “మట్టా” పయనమెటో….?