Telugu News

కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహంలో అమలుకాని మెనూ..

-- అధికారులు తెలియజేస్తే టి సి ఇచ్చి పంపుతా.. అని బెదిరించిన వైనం.

0

కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహంలో అమలుకాని మెనూ
— అధికారులు తెలియజేస్తే టి సి ఇచ్చి పంపుతాని బెదిరించిన వైనం
— కేజీబీవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
— కొరవడిన అధికారుల పర్యవేక్షణ.
— ఎంఈవో తనిఖీల్లో బట్టబయలైన నిజాలు..
(చండ్రుగొండ-విజయo న్యూస్ ):
కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు కావడం లేదు. విద్యార్థులకు పెట్టాల్సిన ఆహారాన్ని సక్రమంగా పెట్టకుండా నిధులను దుర్వినియోగం చేశారు. విద్యార్థులకు వారానికి ఐదు సార్లు పెట్టాల్సిన గుడ్లను, మూడు సార్లు,మటన్ రెండుసార్లు పెట్టాల్సి ఉండగా అసలు పెట్టకపోవడం, పండ్లు, అల్పాహారం పెట్టకుండా విద్యార్థులను పస్తులుంచారు. తనిఖీలో భాగంగా వివరాలు ఇలా ఉన్నాయి.
లక్షలాది రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తున్న, పిల్లలకు సరైన పోషక ఆహారం పెట్టకుండా, చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. సరైన ఆహారం అందించకుండా, పిల్లల ఆరోగ్యం తో చలగాటం ఆడుకుంటున్నారు.. అసలే కరోనా మహమ్మారి తో గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు చదువులకు దూరంగా ఉండి ప్రస్తుతం పరిస్థితులు చక్కబడతాయి అని బాలికలు వసతి గృహంలో కి వచ్చి చదువుకుంటుంటే సరైన పోషక ఆహారం పెట్టకుండా వాళ్లును ఇబ్బందికి గురి చేస్తున్నారు.. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉంటే ఇలాంటి పరిస్థితి పునరావృతం కావు అనీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు..వివరాల్లోకి వెళితే..
మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ వసతి గృహంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం మేరకు మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గురువారం కేజీబీవీ ని తనిఖీ చేశారు.ఈరోజు పెట్టాల్సిన రాగిజావ కు బదులుగా గోధుమ ఉప్మా వండి విద్యార్థులకు పెట్టిన విషయం బయటపడింది. విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్లి వివరాలు అడగగా వాస్తవాలు వెల్లడయ్యాయి. మెనూ ప్రకారం గుడ్లు, మటన్, చికెన్, పండ్లు, అల్పాహారం పెట్టని విషయాలను విద్యార్థులు నేరుగా ఎంఈఓ కు తెలియజేశారు. మెనూ అమలు చేయని విషయాన్ని అధికారులకు తెలియజేస్తే టీసీలు ఇచ్చి బయటకు పంపుతానని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంత కుమారి ఎదిరించిన విషయాన్ని సైతం విద్యార్థులు బహిరంగంగా తెలిపారు. దీంతో ఎంఈఓ స్పెషలాఫీసర్ కాంతకుమారి పై వాస్తవాలను ఉన్నత అధికారులకు తెలియజేస్తాం అని తెలిపారు.మెనూ అమలు చేయని కేజీబీవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

also read :-వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్.