Telugu News

బచ్చోడులో  కాంగ్రెస్ దిండు కదిలింది చూడు

గడపగడపకు కాంగ్రెస్కు అపూర్వ ఆదరణ

0

బచ్చోడులో  కాంగ్రెస్ దిండు కదిలింది చూడు

== గడపగడపకు కాంగ్రెస్కు అపూర్వ ఆదరణ*

== పొంగులేటి శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రసాద్ రెడ్డి ప్రచారం

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బచ్చోడు గ్రామంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి:-;ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!

*- ఉప్పొంగిన కూలీల అభిమానం*
వ్యవసాయ పనులు ముగించుకొని ట్రాక్టర్లో తిరిగి వస్తున్న మహిళా కూలీలు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ని చూసి ..జై శీనన్న , జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. ప్రసాద్ రెడ్డి ఆ ట్రాక్టర్ లోకి ఎక్కి అందరినీ ఆత్మీయంగా పలకరించి మరింత ఉత్సాహం నింపారు.

– *ఇంటింటికీ వెళ్లి.. విన్నవించి*
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి వివరించారు. ఇందిరమ్మ రాజ్యం తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమo అందుతుందని అభయమిచ్చారు.

ఇది కూడా చదవండి:-;ఖమ్మం కాంగ్రెస్ వలసల జోరు.. బీఆర్ఎస్ కు హడల్
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి, కొప్పుల అశోక్, చావా శివ రామకృష్ణ బచ్చోడు సర్పంచ్ రామ సహాయం హరిత రెడ్డి, హస్నాబాద్ సర్పంచ్ బొబ్బిలి భరత్ చంద్ర, మోరపాక నాగయ్య, కట్కూరి శ్రీనివాసరెడ్డి, వనవాసం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.