ఆపదలో అండగా ఉంటా..!
– మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– ఉమ్మడి జిల్లాలో పర్యటన
(ఖమ్మం:విజయం న్యూస్):-
బాధితులకు ఆపదలో అండగా ఉంటానని.. కష్టం వస్తే శీనన్న ఉన్నాడనే భరోసా ప్రతిఒక్కరిలో కలిగేలా సాయం చేస్తానని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. పలు కారణాలతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి చికిత్స నిమిత్తం కొంతమేర ఆర్థికసాయం అందజేశారు. అలాగే ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరుల జంటలను ఆశీర్వాదించి వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలను బహుకరించారు.
also read :-డిఎస్ చేరికకు లైన్ క్లీయర్
ఏన్కూరు మండలంలోని రేపల్లెవాడలో నిమ్మల పిచ్చయ్య ఇటీవల చనిపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. గంగుల నాచరం గ్రామంలో ఇటీవల వివాహం చేసుకున్న వీరబాబు కుమార్తె, అల్లుడ్ని ఆశీర్వాదించారు. భద్రుతండాలో డాక్టర్ గాలీబ్ కుమార్తె, అల్లుడికి ఇటీవల వివాహం కాగా ఆజంటను ఆశీర్వదించారు. వెన్నుముక సమస్యతో బాధపడుతున్న భద్రుతండా సర్పంచ్ సేవియాను పరామర్శించి చికిత్స నిమిత్తం ప్రత్యేక సిఫారసుతో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు చొరవ చూపారు. అదేవిధంగా భద్రుతండాలోని పలు కారణాలతో మృతిచెందిన మరికొన్ని కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
also read :-ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మ్రతి
ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, గార్లఒడ్డు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురభి వెంకటప్పయ్య, పూర్ణకంటి మోసే, జాన్ పాషా, గడల నరేంద్రనాయుడు, సీతారాములు, కోసూరి శీను, ఖమ్మం నగర కార్పొరేటర్లు, జగన్, దొడ్డా నగేశ్ తదితరులు పాల్గొన్నారు.