ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి
** పార్టీ లో చేరికపై 24న ప్రకటిస్తాం
** వచ్చేనెల మొదటి వారంలో జాయినింగ్ ఉంటుంది
** ఆలస్యమవుతున్నందుకు క్షమించండి
** రేవంత్ రెడ్డితో మీట్ అయిన తరువాత విలేఖర్లతో పొంగులేటి
(హైదరాబాద్-విజయం న్యూస్)
ఖమ్మం నగరంలోనే నా అభిమానులు, ఖమ్మం ప్రజలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తో భేటీ అనంతరం మీడియా తో పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు
ఇది కూడా చదవండి:- రాహుల్ గాంధీతో ‘పొంగులేటి’ చర్చలు సఫలం..?
ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకున్నాం.
పార్టీ వివరాలు, చేరికలపై మూడు నాలుగు రోజుల్లో మా నిర్ణయం ప్రకటిస్తాం.
ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి.
కాంగ్రెస్ నాయకులు మా ఇంటికి వచ్చారు.
మేం బీఆర్ఎస్ నుండి ఎందుకు బయటకి వచ్చామో అనేక వేదికలపై చెప్పాం.
ఇది కూడా చదవండి:- సమయం ఆసన్నమైంది..ఇక కురుక్షేత్రమే: పొంగులేటి
తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని తెలంగాణ బిడ్డలు ఆశించారు.
తెలంగాణ ప్రజల కలలు కలలుగానే మిగిలాయి.
సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాం
*24న లేదా 25న మా నిర్ణయం ప్రకటిస్తాం*
నెక్ట్స్ మంత్ ఫస్ట్ వీక్ లో జాయినింగ్ ఉంటుంది.
ఢిల్లీలోనో, హైద్రాబాద్ లోనో జాయిన్ అవ్వను.
ఖమ్మం నడిబొడ్డులో పార్టీలో చేరుతాను.
మూడు అసెంబ్లీ స్థానాలు అనుకుంటున్నాను. అందులో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీచేస్తానని సంచలన ప్రకటన చేశారు.