Telugu News

కూసుమంచిలో  కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

సీఎం కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి

0

కూసుమంచిలో  కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

== విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు

== పరీక్ష పేపర్ లీకేజీ లో బీజేపీ, బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది

== సీఎం కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి

కూసుమంచి, ఏప్రిల్ 5(విజయంన్యూస్):

బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని  కాంగ్రెస్ కూసుమంచి మండల నాయకులు విమ్మర్శించారు. కూసుమంచి మండల కేంద్రంలో ఎన్.ఎస్.యూ.ఐ, యువజన కాంగ్రెస్, ఎస్సీ సెల్ కూసుమంచి మండల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలోని రహదారి పై దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు.  పరీక్ష పేపర్ లీకులపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు, జైల్ లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

ఇది కూాడ చదవండి: *నచ్చిన మందు కావాలా..? అయితే..?*

లీకేజీలపై సమగ్ర విచారణ జరిపించాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రశ్నాపత్రాల లీకేజీలు కొనసాగుతున్నాయని యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్. యూఐ కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయాలను ముట్టడించి విద్యార్థుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తే ప్రభుత్వం, పోలీసులను అడ్డం పెట్టుకొని ఆక్రమంగా కేసులు నమోదు చేయడంతో విద్యార్థి సంఘాల నాయకులను జైలుకు తరలించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వాకం వల్ల 30 లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని, కారకులను కఠినంగా శిక్షించాలని, పకడ్బందీగా నిర్వహించాసిన పదవ తరగతి ప్రశ్నా పత్రాలు కూడా లీకేజీ కావడం రాష్ట్ర ప్రభుత్వ దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం అని వెంటనే లీకేజీల పై సమగ్ర విచారణ జరిపించి ఆందోళనకారులను విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి హాఫీజుద్దిన్, పి.అంజయ్య, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ బెల్లంకొండ శరత్, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు బానోతు వినోద, ఈశ్వరమాదారం సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, ఎన్ ఎస్ యూ ఐ మండల కన్వీనర్ బానోతు హరినాథ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ రావు, యువజన కాంగ్రెస్ పాలేరు ప్రధాన కార్యదర్శి బెల్లి శ్రీశైలం, బిక్షం నాయక్,  బానోతు బొంగా నాయక్, ఎండీ. ఖలీమ్, మాదవ్ రెడ్డి, వనం మధుసూదన్, ఆలేటి రాంబాబు, , అంజిరెడ్డి, చిన్నం సంగయ్య, కిరణ్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: ‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి