ప్రబాస్ మరో సినిమాలో..?
== ‘రాజా డీలక్స్’లో సూపర్ బాయ్ గా ప్రభాస్ ?
(హైదరాబాద్-విజయంన్యూస్)
ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమాకు హీరోగా పరిచయమైనా ప్రభాస్ నేడు ప్రపంచానికే పరిచయం లేని వ్యక్తిగా మారాడు. బహుబలి సినిమాతో ఆయన ప్రపంచస్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోగా మారాడు. దీంతో అనేక సినిమా దర్శకులు, నిర్మాతలు ఆయన సినిమా డెట్స్ కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.
also read :-బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా
అయితే అచితూచి అడుగులు వేస్తున్న ప్రభాస్ మరో కొత్త సినిమాకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ‘రాధేశ్యామ్’ను విడుదలకు సిద్ధం చేయగా, ’సలార్’, ’ప్రాజెక్ట్‌కె’, ’ఆదిపురుష్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మరో సినిమాకు ఆయన సైన్ చేయనున్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వంలో ఓ బ్యూటిఫుల్ చిత్రం చేయనున్నారట. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ అంగీకరించాల్సి ఉందట. ఆయన సై అంటే ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గ్యాప్‌లో ఈ సినిమా పూర్తి చేస్తారని మారుతి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం మారుతి కథ రాసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి ’రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి దానయ్య, నిరంజన్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారట.