Telugu News

శిధిలావస్థలో చింతగుప్ప ప్రభుత్వ పాఠశాల

చర్ల -----విజయం న్యూస్

0

శిధిలావస్థలో చింతగుప్ప ప్రభుత్వ పాఠశాల

(చర్ల —–విజయం న్యూస్)

చర్ల మండలం లోని చింతగుప్ప గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిధిలావస్థకు చేరుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు నిర్వహిస్తున్న పాఠశాల లో సుమారు ఇరవై మంది విద్యార్థులు చదువుతున్నారు.ఇద్దరు ఉపాద్యాయులు విధులు నిర్వహిస్తున్న ఈ పాఠశాల లో కరోనా తో ఇటీవలే గొంది నర్సింహరావు అనే ఉపాద్యాయుడు మృతి చెందారు. ఆయన స్థానం అలాగే కాళీగా ఉంది. సుమారు ఇరవై సంవత్సరాల క్రిందట నిర్మించిన ఈ పాఠశాల ప్రస్తుతం అవసాన దశకు చేరుకుని ప్రమాదకరమైన పరిస్తితులలో ఉంది. శ్లాబు పెచ్చులు ఊడిపోయి,కనీసం తెల్ల సున్నం రంగు కూడా లేకుండా బూత్ బంగ్లా లా గోచరిస్తోంది. పెచ్చులు ఊడిపోయి ఎక్కడ విద్యార్థుల మీద పడతాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కోట్ల రూపాయల ప్రజా ధనం వ్యర్దమైన కార్యక్రమాలకు ఖర్చు పెట్టే నాయకులు

also read :-ఇష్టా రాజ్యం… అంతా మా ఇష్టం…!
,ప్రభుత్వం ఇలాంటి పిల్లల చదువులకు ఉపయోగపడే ,భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాల ల బాగుకు వెచ్చించక పోవడం దారుణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.సంబంధిత వివరాలకై మండల విద్యాశాఖ అధికారి ఎమ్ ఇ ఓ జుంకిలాల్ ను సంప్రదించ గా ఆ స్కూల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అని ఐటిడిఎ పరిధిలో ఆ సమస్య ఉన్నందున ఎటిడబ్లూ ఓ ని సంప్రదించమని సమాదానమిచ్చారు. ఐటిడిఎ పరిధిలో ఉన్న స్కూల్లకే ఈ పరిస్థితి ఉంటే జనరల్ స్కూల్ల పరిస్థితి ఏమిటోనని సామాన్యులు పెదవి విరుస్తున్నారు.