Telugu News

*దాన్యం కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే సండ్రా కు సీఎం నుంచి ఫోన్ కాల్…

క్యాంప్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ

0

*దాన్యం కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే సండ్రా కు సీఎం నుంచి ఫోన్ కాల్…

(హైదరాబాద్ విజయంన్యూస్) :-
దాన్యం కొనుగోలు విషయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. క్యాంప్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ అనంతరం ఫోన్ రాగా ధాన్యం కొనుగోలు ఎలా సాగుతున్నాయని సీఎం ప్రశ్నించినట్లు చెప్పారు.

ఎమ్మెల్యే బదులిస్తూ . లారీలు, బస్తాలు, ట్రాన్స్ పోర్ట్, మిల్లర్ల సమస్య ఉందని, రైతుల నుంచి ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోలు చేయలేదని ఆయన సీఎం గారికి తెలిపారు రైతులు నెల రోజుల నుంచి యార్డుల వద్ద పడిగాపులు పడుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే సండ్ర సమాధానానికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అధికారులను ఆదేశిస్తానని, రైతుల పక్షాన నిలబడుతూ పోరాటం సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని సీఎం చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని చెప్పారన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సీయస్ సోమేష్ కుమార్ ఎమ్మెల్యేతో ఫోన్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అధికారుల పర్యవేక్షణ నిత్యం ఉంచుతామని, లారీలు ట్రాన్స్ పోర్ట్, మిల్లర్ల సమస్యలు తలెత్తకుండా చూస్తామని అన్నారు. తాలు, తేమ శాతం లేకపోయినా కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారన్నారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన నిలబడిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ లకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

also read :- అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?