Telugu News

కారేపల్లి మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

కారేపల్లి -విజయం న్యూస్

0

కారేపల్లి మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

(కారేపల్లి -విజయం న్యూస్)
కారేపల్లి మండల కేంద్రంలో లో ప్రభుత్వ స్థలాలలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణ చేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న అక్రమ కట్టడాలను సోమవారం అధికారులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు మండల రెవిన్యూ, ఆర్ ఎన్ వి, పంచాయతీ రాజ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు.

also read :-ఖమ్మంలో యువజన కాంగ్రెస్ నూతన సంవత్సర వేడుకలు..

పలువురు చిరువ్యాపారులు రోడ్డుపై దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగుతున్న తరుణంలో కొందరు గ్రామస్తులు ఇటీవల మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ గౌతమ్ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు సోమవారం కట్టడాలు కూల్చి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డి దేవిక, ఏసీపీ బసవ రెడ్డి, సీఐ ఆరిఫ్ అలీ ఖాన్, కారేపల్లి కామేపల్లి తిరుమలాయపాలెం ఎస్సైలు కుష కుమార్, లక్ష్మిi భార్గవి, రవి, ఎంపీడీవో చంద్రశేఖర్, తాసిల్దార్ రవికుమార్, ఎంపీవో రాజారావు తదితరులు పాల్గొన్నారు