Telugu News

పార్లమెంట్ లో ప్రజా గొంతుకనై ప్రశ్నిస్తా : నామ

తెలంగాణ ప్రయోజనాలు కోసం గెలిపించండి : నామ

0

పార్లమెంట్ లో ప్రజా గొంతుకనై ప్రశ్నిస్తా : నామ

➡️ తెలంగాణ ప్రయోజనాలు కోసం గెలిపించండి : నామ

➡️ ఐదేళ్లు కార్యకర్తలకు అండగా ఉంటా

👉 కారేపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్

(ఖమ్మం, కారేపల్లి -విజయం న్యూస్)

తెలంగాణా ప్రయోజనాలు కాపాడేందుకు పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకనై ఉండేందుకు మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఓటర్లను కోరారు.ఇప్పడు కష్టపడి గెలిపించండి…ఐదేళ్లు మీకు అండగా ఉండి, కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పారు.బూత్ స్థాయిలో రాత్రిoబవళ్ళు సైనికుల్లా పని చేసే, తనను గెలిపించాలన్నారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ మోసాన్ని వివరించి, చైతన్య పర్చాలన్నారు.10 ఏళ్ళు కేసీఆర్ నిర్దేశకత్వం లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నామని , కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్ల రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. ప్రజల్ని అంటిపెట్టుకొని, పని చేయలన్నారు. తెలంగాణ కు పూర్వ వైభవం రావాలంటే బీఆర్ ఎస్ అభ్యర్థులు గెలవాలన్నారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: నామా

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ నామను చారిత్రాత్మకంగా గెలిపించుకోవడం ద్వారా బీఆర్ ఎస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. తెలంగాణా ప్రయోజనాలు కాపాడడం ఒక్క బీఆర్ఎస్ వల్లనే సాధ్యమవు తుందన్నారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ నామ నాగేశ్వరరావు ను గెలిపించుకోవడంద్వారా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమర్థవంతంగా పని చేసే నామ నాగేశ్వరరావు గెలిస్తేనే తెలంగాణా హక్కులు కాపాడబడతాయని చెప్పారు. కాంగ్రెస్ ను తరమికొట్టి, తెలంగాణా ను రక్షించుకోవాలని అన్నారు ఇంటింటికి వెళ్లి నామ విజయానికి కృషి చేయాలని పార్టీ వైరా నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అన్నారు.
జెట్పీటీసీ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బత్తుల శ్రీనివాసరావు , ఉన్నం వీరేందర్, ఎంపీటీసీ మూడ్ జ్యోతి, నర్శింగ్ శ్రీనివాసరావు, గౌసుద్దీన్, హన్మకొండ రమేష్, దొంతెన రవీందర్, శంకర్ తదితరులు తో పాటు నామ సేవా సమితి నుంచి తాళ్లూరి హరీష్, సరిపూడి గోపి, పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.