Telugu News

మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన.

వాజేడు విజయం న్యూస్

0

మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
(వాజేడు విజయం న్యూస్):-
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, రైతుబంధు మండల అధ్యక్షులు కాకర్లపూడి వీర వెంకట సుబ్బారాజు ( మురళి బాబు) దశదిన కర్మ కు హాజరై మురళి బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ములుగు గట్టమ్మ దేవాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మంపాటి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు.

also read;-పినపాక టిఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గవిభేదాలు

బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి యాబై వేలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. చికిత్స పొందుతున్న ఖమ్మంపాటి సుజాతకు పూర్తి చికిత్స ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, టి ఆర్ యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.