Telugu News

ఐఎన్ సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి సంజయ్

బ్రిటీషోడు స్థాపించిన పార్టీ కాంగ్రెస్

0

ఐఎన్ సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి సంజయ్

== బ్రిటీషోడు స్థాపించిన పార్టీ కాంగ్రెస్*

== బీజేపీ అంటే భారతీయ ఆత్మ*

== బీజేపీ వ్యవస్థాపకులు వాజ్ పేయి, అద్వానీ…*

== కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తుల్లో 55 శాతం గుంజుకోవడం ఖాయం*

== ఆ పార్టీ అగ్రనేత శ్యాంపిట్రోడాయే మాటలే ఇందుకు నిదర్శనం..*

== కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదు.. రాష్ట్రానికి పట్టిన శని*

== జూన్ 4న బీఆర్ఎస్ కు పాతరేసి కాళోజీ మాటలను నిజం చేస్తాం…*

== దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నది మోదీ ప్రభుత్వమే*

== అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లను బుద్ది చెప్పండి*

== మానకొండూరు ‘దళిత సమ్మేళనం’లో బండి సంజయ్ హాట్ కామెంట్స్….*

(కరీంనగర్-విజయం న్యూస్)

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని, బ్రిటోషోడు స్థాపించారని చెప్పారు. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రిటీష్ సివిల్ సర్వంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బ్రిటీష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నరని….

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగడతాం: బండి సంజయ్ 

పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ. ఈ దేశ ముద్దు బిడ్డలు వాజ్ పేయి, అద్వానీ స్థాపించిన పార్టీ బీజేపీ. మరి కాంగ్రెస్ లో భారతీయత ఎక్కడుంది?’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఏలుతున్న గాంధీ కుటుంబం డూప్ అని… మహాత్మాగాంధీ అసలు సిసలైన గాంధీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే.. పేదలు సహా ఎవరు చనిపోయినా… వారి ఆస్తిలో 55 శాతం కాంగ్రెస్ గుంజుకోవాలని కుట్ర చేస్తోందని హచ్చరించారు.. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విభాగం ఇంఛార్జీ శ్యాం పిట్రోడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. మోదీ హయాంలోనే దేశానికి, ధర్మానికి రక్ష అని చెప్పిన బండి సంజయ్.. ఈ దేశంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయంటే… దేశం సురక్షితంగా ఉందంటే అది మోదీ చలువేనని ఏ జవాన్ ను అడిగినా చెబుతారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- ఆకలి చావులకు సర్కార్ దే బాధ్యత: రాణి రుద్రమదేవి 

ఈరోజు మధ్యాహ్నం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మానుకొండూరులో నిర్వహించిన ‘దళిత సమ్మేళనం’కు బండి సంజయ్ తోపాటు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర నాయకులు సురేష్, శ్రీనివాస్, సొల్లు అజయ్ వర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిత సమ్మేళనంలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

57 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ ఏనాడూ దళితుల అభ్యున్నతికి పనిచేయలేదు. అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన పార్టీ బీజేపీ. పార్లమెంట్ లో దళితుల హక్కులపై మాట్లాడుతున్న అంబేద్కర్ ను అడ్డుకున్న వ్యక్తి జవహార్ లాల్ నెహ్రూ. రాజీనామా చేసి బయటకు వచ్చి పోటీ చేస్తే అనేక కుట్రలు చేసి అంబేద్కర్ ను ఓడించి దారుణంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ మరణిస్తే ఆయన పార్ధివదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబయి తరలించి అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఎన్నికలప్పుడే తప్ప ఏనాడూ దళితులను పట్టించుకోని మోసపూరిత పార్టీ కాంగ్రెస్.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కేసీఆర్ దళితులను మోసం చేశారు. మాట ఇస్తే తల నరుక్కుంటానే తప్ప మాట తప్పనన్న కేసీఆర్ ఎన్నడైనా మాట మీద నిలబడ్డారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఓట్లు దండుకుని చివరకు అభివ్ర్రుద్ది పేరుతో దళితుల భూమినే గుంజుకున్న చోర్ కేసీఆర్. అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు కూడా హాజరుకాని అహంకారి కేసీఆర్. ఆనాడు కనీసం దళిత సంఘాలు కేసీఆర్ ను నిలదీయకపోవడం బాధాకరం.

ఇది కూడా చదవండి:- తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే: బండి సంజయ్

అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూ.చ తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ. రాజ్యాంగాన్ని మారుస్తామని ఏ ఫాల్తుగాడు అన్నా సహించేది లేదు.. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న మహానేత మోదీ. ప్రధాని పదవి అంబేద్కర్ భిక్షేనని నిండు పార్లమెంట్ లో చాటి చెప్పిన నేత మోదీ. పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా రూ.5 కోట్ల రునాలిస్తూ… ప్రతి ఏటా 1.25 లక్షల మందిని పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న ప్రభుత్వం బీజేపీదే. కాంగ్రెస్ హయాంలో 50 మందికి మించి విదేశీ విద్యను అభ్యసించే అవకాశం లేకపోతే.. ఆ సంఖ్యను వందల్లో పెంచిన నాయకుడు మోదీ. విద్యార్థుల స్కాలర్ షిప్పుల కోసం రూ.50 వేల కోట్లను కేటాయించిన సర్కార్ మోదీదే. ఆ స్కాలర్ షిప్పుల సొమ్ములో 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరినా కేసీఆర్ పట్టించుకోలే. నేరుగా తనకే దళితుల సొమ్ము ఇవ్వాలని కండిషన్ పెట్టి దళితులను చదువుకు దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. అందుకే కేసీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.

‘ఇందిర అభయ హస్తం పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.12 లక్షల ఆర్దిక సాయం చేస్తాం.. ఇందిరమ్మ పథకం పేరుతో ఇంటి జాగా, రూ.6 లక్షల సాయం చేస్తాం’ అని హామీ ఇచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్.

బీజేపీ ఏనాడూ హామీ ఇవ్వకపోయినా దళితుడు రామ్ నాథ్ కోవింద్ ను, గిరిజన ఆదివాసీ పేద మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 27 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. అంతకుముందు 57 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా దళితులను రాష్ట్రపతి చేసిందా? పెద్ద ఎత్తున దళితులకు కేబినెట్ లో చోటు కల్పించిందా? సమాధానం చెప్పాలే…

బీజేపీ మూలాలన్నీ భారత్ లోనే ఉన్నయ్. వాజ్ పేయి, అద్వానీ బీజేపీని స్థాపించారు. మరి బ్రిటీష్ జనతా పార్టీ ఎట్లయితది? అసలు కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్ అనే వ్యక్తి. బ్రిటీషోడు స్థాపించిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న గాంధీ కుటుంబం డూప్. మహాత్మాగాంధీ మనకు అసలు సిసలైన గాంధీ. ఇప్పుడున్న గాంధీ కుటుంబం మూలాలు ఇటలీ దేశానివి. ఐఎన్ సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు…. ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఎందుకంటే సోనియా పుట్టి పెరిగింది ఇటలీలోనే. కాంగ్రెస్ మూలాలు అక్కడివే.

ఇగ కేసీఆర్ అంటడు… తెలంగాణ అంటేనే కేసీఆర్ అట. తెలంగాణ కోసమే పుట్టిండట. ఆయన గుండెనిండా తెలంగాణ ప్రజలే ఉన్నరట… సిగ్గుండాలే.. అధికారంలో ఉన్నన్నాళ్లు తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టినవ్. ఉద్యోగాలడితే నిరుద్యోగులపై లాఠీ ఛార్జీ చేయించి జైల్లో పెట్టించినవ్. పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పడేసినవ్. రైతులు వడ్ల కల్లాలపై గుండె పగిలి చస్తుంటే కనికరించని కఠినాత్ముడివి. వానలతో పంట నష్టపోతే పైసా చేయని దుర్మార్గుడివి. మద్యాన్ని ఏరులై పారించి మహిళల పుస్తెల తాడు తెంచిన నీచుడివి… నువ్వు తెలంగాణ ఆత్మవా?… తెలంగాణకు పట్టిన శనివి. అందుకే కర్రు కాల్చి వాత పెట్టినా నీకు సిగ్గు రాలేదు. కాళోజీ చెప్పినట్లుగా పరాయోడు మోసం చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టమన్నడు.. సొంతోడు మోసం చేస్తే పాతపెట్టమన్నడు కదా. తెలంగాణను దోచుకున్న ఆంధ్రా పాలకులను తరిమికొట్టి పొలిమేర దాటించినం. ఇగ బీఆర్ఎస్ ను పాతరేసే టైమొచ్చింది. జూన్ నెల 4న ఆ పార్టీని గొయ్యి తీసి వెయ్యి అడుగుల లోతున పాతరేసేందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజలు సిద్ధమైనరు…

దయచేసి కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు ఎన్నడైనా మీ వద్దకు వచ్చారా? మీ కోసం ఎన్నడైనా పోరాడారా? నేను ప్రజల కోసం చేసిన పోరాటాలేమిటో… వాళ్లు చేసిన పోరాటాలేమిటో బేరీజు వేయండి. ఎవరికి ఓటేస్తే మీ ఓటుకు విలువ ఉంటుందో వారికే ఓటేయండి.. నన్ను ఓడించేందుకు ఇద్దరు పార్టీలు ఒక్కటైనయ్. కేసీఆర్ కూడా 5 రోజులు కరీంనగర్ కు వచ్చి నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేస్తున్నరు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడితే జబర్దస్ట్ కంటే ఫుల్ కామెడీగా ఉంటుందని జనం చేస్తున్నరు. అట్లాంటోడి మాటలు నమ్మితే మళ్లీ మోస పోతారు జాగ్రత్త.

*ఎస్. కుమార్ మాట్లాడుతూ…*

అంబేద్కర్ సిద్ధాంతాలను బీజేపీ మినహా ఇతర పార్టీలేవీ అమలు చేయడం లేదు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ దళితులను ఓటు బ్యాంకుగానే చూశాయి. ఇది గమనించిన అంబేద్కర్ కాంగ్రెస్ ను విబేధించి జన సంఘ్ తో కలిసి పార్లమెంట్ లో దళిత హక్కుల అమలు కోసం నిరంతరం క్రుషి చేశాయి… అంబేద్కర్ జనసంఘ్, జనతా పార్టీతో కలిసి పనిచేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అట్టడుగునున్న పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ‘అంత్యోదయ’ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఆ సిద్దాంతాన్ని తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న నాయకుడు బండి సంజయ్. నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీసహా అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం తపించే నేత బండి సంజయ్. కిందిస్థాయి నుండి ఉన్నతస్థాయికి ఎదిగిన బండి సంజయ్ అట్టడుగువర్గాలకు అండగా కొనసాగుతూనే ఉన్నారు. దళితులను ఇసుక లారీలపై తొక్కించి చంపాలని చూస్తే ఎదురించి పోరాడిన నాయకుడు బండి సంజయ్. మోదీ హయాంలో ఎస్సీలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నయ్. ఎస్సీ రిజర్వేషన్లను తగ్గించే ప్రసక్తే లేదు.. మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి తీరుతాం.. కమలం పువ్వుపై ఓటేసి మోదీని బలపర్చండి. బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించండి….