Telugu News

రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు – జిల్లా కిసాన్ కాంగ్రెస్

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలనుకోవడం దారుణమని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ అన్నారు.

0

రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు – జిల్లా కిసాన్ కాంగ్రెస్

(ఖమ్మం – విజయం న్యూస్) :-

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలనుకోవడం దారుణమని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ అన్నారు.

మాటిమాటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి అలవాటైందని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా ఉన్నదని దీని వల్ల సామాన్యులు ఫ్లాట్లు కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచి ఆరు నెలలు కాకముందే మళ్లీ పెంచాలనుకోవడం అవివేకమని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల వల్ల చాలా ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావట్లేదని దానివల్ల ఫ్లాట్లు కొన్న సామాన్యులు అయిన వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

also read :- గ్రానైట్ సమస్యలపై మంత్రి పువ్వాడ చూపిన చొరవ.

ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో వున్న లోపాల్ని ఆధారంగా తీసుకొని వెంచర్ యజమానులు మాత్రం తమ ఫ్లాట్లను యదైచ్ఛగా అమ్ముకున్నారని ఇప్పుడు ఫ్లాట్లు మొత్తం సామాన్యుల చేతిలోనే ఉన్నాయని అవి రిజిస్ట్రేషన్ కాక తమ ఆర్థిక అవసరాలకు అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదని రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్ది గతంలో రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయాలని, ప్రభుత్వం దీనిపై నిర్ణయం తొందరగా తీసుకోవాలని పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని గతంలో కూడా ఎల్ఆర్ఎస్ అని ధరణి అని రకరకాల పథకాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం దెబ్బ తీసిందని, మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బ తీయకుండా ప్రోత్సహించాలని..,

నేలకొండపల్లి మరియు కామేపల్లి మండలాల్లో రైతుల ఇళ్లకు తాళాలు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డిసిసిబి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కరోనా కష్టకాలంలో రైతుల ఇళ్లకు తాళాలు వేసి అవమానించడం ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదలను తగ్గించని పక్షంలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల ముందు ధర్నా చేస్తామని తెలిపారు.

also read :- రికార్డులను స్వాధీనపరుచుకున్న డీఎల్పీవో