Telugu News

మోదీ, కేసీఆర్ తోడు దొంగలు : ఇందిరశోభన్

▪️ భారత్ బంద్ లో టీఆర్ఎస్ పాల్గొనకపోవడం సిగ్గుచేటు..▪️ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే..

0

మోదీ, కేసీఆర్ తోడు దొంగలు..
▪️ భారత్ బంద్ లో టీఆర్ఎస్ పాల్గొనకపోవడం సిగ్గుచేటు
▪️ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే..
▪️ లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం..
▪️ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఇందిరాశోభన్ ఫైర్

(హైదరాబాద్ -విజయం న్యూస్)

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఒకే తాను ముక్కలని మరోసారి రుజువైందన్నారు మహిళా నాయకురాలు ఇందిరాశోభన్. భారత్ బంద్ లో టీఆర్ఎస్ సర్కార్ పాల్గొనకపోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ నారాయణగూడ ప్లైఓవర్ నుంచి సికింద్రాబాద్ వరకు నిర్వహించిన విపక్షాల నిరసన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. పొరుగు రాష్ర్టాలైన ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే.. కేసీఆర్ కు సోయి ఎందుకు లేదని ఇందిరాశోభన్ మండిపడ్డారు. ఈ బంద్ తో మోదీ, కేసీఆర్ తోడు దొంగలని మరోసారి తేటతెల్లమైందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ఇందిరాశోభన్ ఆరోపించారు. సామాన్యుల బతుకులను భారంగా చేస్తున్న ఈ ప్రభుత్వాలు గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దుతో సహా 11 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. లేనిపక్షంలో ప్రజా పక్షాలు, ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకమై అటు మోదీ, ఇటు కేసీఆర్ సర్కార్లకు తగిన బుద్ధి చెబుతామని ఇందిరాశోభన్ హెచ్చరించారు.

ఇది చదవండి : టీఆర్ఎస్ సర్కార్ పై ఇందిరా శోభన్ ఫైర్