Telugu News

దేశంలో త్వరలో లాక్ డౌన్..? నూతన సంవత్సర వేడుకలకు బ్రేక్..?

ఒమిక్రాన్ వైరస్ ను నియంత్రించే యోచనలో కేంద్రం

0

దేశంలో త్వరలో లాక్ డౌన్..?

** ఒమిక్రాన్ వైరస్ ను నియంత్రించే యోచనలో కేంద్రం

** కొత్తసంవత్సర వేడుకలకు పుల్ స్టాఫ్ పెట్టే యోచన

** ఈనెల 25 నుంచి జనవరి 5 వరకు రాత్రిపూట కర్ప్యూ.. అవసరమైతే లాక్ డౌన్ విధించే అవకాశం

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

దేశంలో ఒమిక్రాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందా..? హెల్త్ అర్గనేజేషన్ భారతదేశాన్ని ముందే హెచ్చరిస్తుందా..? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని సూచించిందా..? దీంతో ఒమిక్రాన్ నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టిందా..? మరోసారి లాక్ డౌన్ దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోందా..? కర్ప్యూ విధించే అవకాశం ఉందా.? లేదంటే నిబంధనలను కఠినతరం చేసే యోచనలో ఉందా…? ఒమిక్రాన్ వైరస్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోబోతున్న చర్యలు చాలా కఠినంగా ఉండబోతున్నాయా..? జనవర వేడుకలను రద్దు చేసే యోచనలో కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు యోచన చేస్తున్నాయా..? అన్ని ప్రశ్నలకు సమాధానం నిజమే అన్నట్లుగా కేంద్రం అడుగుల వేస్తుంది.

ALLSO READ :- బొల్తా పడిన బస్సు.. 8మంది మృతి

మరోసారి లాక్ డౌన్ అంశం తెరపైకి వచ్చింది.. కరోనా ప్రభావంతో గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం..ఓమిక్రాన్ ప్రభావంతో మరోసారి లాక్ డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది..ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. ఫ్రస్తుతం తెలంగాణ రాష్ర్టానికి వైరస్ పాకింది. వేరే రాష్ట్రాల్లో కూడా వైరస్ మెల్లమెల్లగా పాకుతోంది.. ఈ క్రమంలో వైరస్ ను నియంత్రించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం.. అతి త్వరలోనే లాక్ డౌన్ దిశాగా అడుగులు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.. లాక్ డౌన్ విధిస్తారా.. లేదంటే నైట్ కర్ప్యూ విధించి అదుపుచేసేందుకు ప్రయత్నం చేస్తారా.? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.. కానీ కచ్చితంగా ఓమిక్రాన్ నియంత్రణ చర్యలు తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది..

 ** భయపెడుతున్న ఓమిక్రాన్..

రెండవ వేవ్ తగ్గుముఖం పట్టిందిలే అని ఊపిరిపిల్చుకుంటున్న తరుణంలో వైద్యఆరోగ్యశాఖ మరో బాంబుపెల్చింది.. మూడవ వేవ్ ఓమిక్రాన్ రూపంలో చోరబడే అవకాశం ఉందని, విద్వాంసం సష్టించే అవకాశం ఉందని ప్రపంచవైద్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అనుకున్నట్లుగానే ఓమిక్రాన్ ప్రపంచంలోకి చొరబడింది. అంతే కాదు భారతదేశంలోకి, ప్రసుతతం తెలంగాణ రాష్ర్టంలోకి చొరబడింది.. ఇతర దేశాల్లో ఓమిక్రాన్ వైరస్ ప్రజలను అతలాకుతలం చేస్తోంది.. ఆ వైరస్ సోకిన ఏ ఒక్కరు కూడా కోలుకునే పరిస్థితి లేకుండాపోతుంది. దీంతో యావత్తు ప్రపంచాలే భయపడుతున్నాయి. అందులో భాగంగానే భారతదేశ ప్రభుత్వం కూడా భయపడుతోంది.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునే యోచనలో నిమగ్నమైంది. ఇప్పటికే మాస్క్ తప్పనిసరి అనే నిబంధన పెట్టిన కేంద్రప్రభుత్వం మరి కొన్ని నిబంధనలను అమలు చేసే యోచనలో ఉంది.

** కొత్తసంవత్సర వేడుకలకు పుల్ స్టాఫ్..?

ఓమిక్రాన్ వైరస్ దేశంలోకి రావడం, కేసులు పెరుగుతుండటంతో ఆ వైరస్ నియంత్రణలో భాగంగా నూతన సంవత్సర వేడుకలకు పుల్ స్టాఫ్ పెట్టే యోచనలో కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలను భారత దేశంలో చాలా గొప్పగా చేసుకుంటారు. పబ్బులు, డ్యాన్సులు, ఒక వద్ద గుంపులుగుంపులగా చేరి పార్టీలు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఓమిక్రాన్ వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రప్రభుత్వం నియంత్రణకు యోచన చేస్తున్నట్లు సమాచారం.

ALLSO READ :- ప్రతి ధాన్యం గింజను కొంటాం :మంత్రి పువ్వాడ అజయ్ 

అందుకే ఈనెల 25 నుంచి జనవరి 20 వరకు రాత్రికర్య్పూ, ఈనెల 30 నుంచి జనవరి 2 వరకు లాక్ డౌన్ విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది పుకార్లేనని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికి  వైద్యఆరోగ్యశాఖ మాత్రం లాక్ డౌన్ తప్పదు అన్నట్లుగా మాట్లడుతుంది. చూద్దాం.. రాబోయే రోజుల్లో కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయో..?