ఇండియా టార్గెట్ 148
== పాకిస్తాన్ బ్యాటింగ్ ను కట్టడి చేసిన ఇండియా బోలర్లు
== 147 రన్స్ కే ఆలౌట్ అయిన పాకి బ్యాట్సెమెన్
== రెండవ బాల్ కే ఇండియా వికెట్ ఆవుట్
(క్రీడావిభాగం-విజయంన్యూస్)
దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఇంట్రస్టింగ్ మ్యాచ్ గా మారింది.మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న ఇండియా టీమ్ పాకిస్తాన్ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. నిర్ణిత 20 ఓవర్ల మ్యాచ్ లో పాకిస్తాన్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మమ్మమ్మద్ రిజ్వాన్ 43(42), ఇస్తికర్28(22) మినహా ఎవరు రాణించలేదు. అయితే చివరిలో 11 వికెటర్ గా వచ్చిన దహాని వీరఉతుకుడు ఉతికాడు. లాస్ట్ వికెట్ భాగస్వామ్యానికి హరీస్ రౌఫ్ సహాకారంతో దహాని చివరి 17 బంతుల్లో 31 పరుగులు రాబట్టి పాకిస్తాన్ కు మంచి స్కోర్ అందించారు.ఆయన వ్యక్తిగతంగా 6బంతులకే 16 పరుగులు చేసి భారత్ టీమ్ సభ్యులకు చుక్కలు చూపించారు. ఇక ఇండియా టీమ్ లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా, అక్షరదీప్ సింగ్ 2 వికెట్లు, హార్థిక్ పాండ్యా 3 వికేట్లు, అవేష్ ఖాన్ 1 వికేట్ తీశారు. అనంతరం ఇండియా బ్యాటింగ్ ప్రారంభం కాగా ఓపెనర్లుగా కెప్టేన్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ క్రీజ్ లోకి రాగా మొదటి రెండవ బంతికే కెఎల్ రాహుల్(0) పెవిలియన్ కు చేరాడు. దీంతో వన్ డౌన్ కు మాజీ కెప్టేన్ కోహ్లీ క్రిజ్ లోకి వచ్చాడు. చాలా రోజుల తరువాత క్రిజ్ లోకి వచ్చిన కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉంటుందని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.
allso read- నేడు పాక్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ