ఆస్ట్రేలియా పై భారత్ విక్టరీ
== ఆరు వికేట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా
== అర్థసెంచరీలతో సూపర్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ, సూర్యకుమారి,
== దంచికొట్టిన పాండ్యా
== మూడు మ్యాచ్ ల ఈ టోర్ని భారత్ వశం
(క్రీడా విభాగం-విజయంన్యూస్)
భారత్ టీమ్ ఘనవిజయం సాధించింది.. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో టీమీండియా ఆస్ట్రేలియా పై ఘన విజయం సాధించింది.. అత్యధిక పరుగులు చేసినప్పటికి ఆస్ట్రేలియా బౌలింగ్ చేజింగ్ లో తడబడింది. దీంతో ఆరు వికేట్ల తేడాతో ఓటమిపాలైంది.. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ భారత్ వశమైంది. 2-1 విజయంతో టోర్నీని టీమిండియా గెలిచింది.
Allso read:- బెల్లం వేణు… నీ చరిత్ర విప్పవమంటావా..?: మౌలానా
పూర్తి వివరాల్లోకి వెళ్తే మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న టీమిండియా బౌలింగ్ విషయంలో కొంత తడబడిందనే చెప్పాలి.మొదటిగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణేత 20ఓవర్లకు గాను ఏడు వికేట్ల నష్టానికి 186 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా టీమ్ లో టీమ్ డేవిడ్ 54(27బంతుల్లో), కేమరన్ 52(24బంతుల్లో) అర్థం సెంచరీలు పూర్తి చేసి మంచి స్కోర్ అందజేశారు. చివరిలో బ్యాట్సెమెన్ డెనియల్ స్యామ్స్ దంచికొట్టారు.. భారత్ బోలర్లను ఆడేసుకున్నారు.. టీమీండియా బోలర్ అక్షర్ పటేల్ 3, చహేల్, పటేల్ చరో వికేట్ తీశారు.
allso read:- మహిళా తన ఇద్దరి పిల్లలతో ఆత్మహత్యయత్న
186 పరుగుల లక్ష్యంగా క్రిజ్ లోకి వచ్చిన టీమిండియా ప్రారంభంలోనే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వికెట్ల ను నష్టపోయింది..దీంతో పోస్ట్ డౌన్, సెకండ్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కొంత తడబడినప్పటికి వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడారు. ఆ తరువాత రెచ్చిపోయిన సూర్యకుమార్, విరాట్ బంతి పై తమ ప్రతాపం చూపించారు. విరాట్ 36బంతుల్లో 69 పరుగులతో వీర విహారం చేశాడు. ఆయనకు తోడుగా సూర్య 48బంతుల్లో 62పరుగులు చేసి ఇద్దరు ఆఫ్ సెంచరీలు చేశారు. చివరిలో వికెట్ నష్టపోవడం తో క్రిజ్ లోకి వచ్చిన పాండ్యా మరోసారి తన ప్రతాపం చూపించాడు. చివరిలో లో 16బంతుల్లో 25 పరుగులు చేసి టీమిండియా విజయానికి కీలకపాత్ర పోషించారు. దినేష్ కార్తీక్ రెండు బంతుల్లోనే ముగించాడు. దీంతో సీరిస్ దక్కించుకున్నట్లైంది. అయితే ఒకే మ్యాచ్ లో నలుగురు ఆఫ్ సెంచరీలు చేయడం గమనర్హం.