Telugu News

వేప విత్తనాలతో సీడ్ గణపతి ప్రతిమల పంపిణికి శ్రీకారం: మంత్రి పువ్వాడ

రూ నాలుగు లక్షల చెక్కును విద్యుత్ ఎస్ఈ కి అందజేసిన మంత్రి పువ్వాడ..

0

వేప విత్తనాలతో సీడ్ గణపతి ప్రతిమల పంపిణికి శ్రీకారం: మంత్రి పువ్వాడ

== ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించి పండుగను చేసుకుందాం.

== పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో మట్టి వినాయక మండపం లకు ఉచిత పోలీస్ పెర్మిషన్, విద్యుత్ బిలు..

== రూ నాలుగు లక్షల చెక్కును విద్యుత్ ఎస్ఈ కి అందజేసిన మంత్రి పువ్వాడ..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సకల విఘ్నాలను తొలగిస్తూ, అన్ని ఆపదల నుంచి రక్షించమని మనం పూజించే గణపతిని విత్తన(అంకుర గణపతి) రూపంలో పూజలు చేయడం శుభ పరిణామం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో రూపొందించిన విత్తన గణపతి ప్రతిమలకు ఉచితంగా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ స్వయంగా పాల్గొని పంపిణి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కాలుష్యం.. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవటంతో పాటు సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఇది కూడా చదవండి: పేదల సొంత ఇంటి కల గృహ లక్ష్మీపథకం.. మంత్రి పువ్వాడ..

ఈ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి వినాయకుడు ని ప్రతిష్టించాలని, అందులో వినూత్న కార్యక్రమంలో భాగంగా  ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించటమే ఈ విత్తన గణపతి ముఖ్య ఉద్దేశమని అన్నారు. వినాయక విగ్రహాలను వినియోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ చాలా ప్రమాదకరమని, అందులో వినియోగించే రంగులు మానవ దేహానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలను మట్టి వినాయకుడి వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గడచిన ఐదేళ్ల నుండి నా సొంత ఖర్చులతో వినాయక చవితికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ లకు విత్తన గణపతిని (సీడ్ గణేష్) ప్రతిమలను పంపిణి చేయాలని నిర్ణయించామని, ఈ మేరకు లాంఛనంగా శనివారం విత్తన గణపతిని పంపిణి ప్రారంభించామని అన్నారు. పర్యావరణ హితంకై స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతుందని, మరో వారంలో పూర్తిస్థాయి మొక్కగా మారుతుందన్నారు. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొక్కను అందరూ తమ ఆవరణల్లో నాటుకోవచ్చుని, పర్యావరణ మార్పులు, కాలుష్యం ను పారదోలేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని పెంచటమే మార్గమని మంత్రి అన్నారు. మట్టి విగ్రహాలననే ప్రోత్సహించాలని, వచ్చే ఏడాది నుండి మాత్రం కచ్చితంగా మట్టి వినాయకుడినే ప్రతిష్టించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం సమూలంగా రూపుమాపాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: టీడీపీ అభ్యర్థులుగా జనసేన పార్టీ నేతల పోటీ

ఎందుకంటే నిమజ్జన చేసే కల్వోడ్డు బతుకమ్మ ఘాట్ వద్ద వచ్చే ఏడాది మున్నేరు రివర్ ఫ్రంట్ గా మారిపోతుందని, అక్కడ ప్రజల ఆహ్లాదం కోసం సుదరరీకరణ చేస్తున్నామని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.690 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ప్రజల అవసరాల కోసం మున్నేరు పై మూడు చెక్ డ్యాం లు నిర్మించనున్నాం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడు విగ్రహాలు అక్కడ నిమజ్జనం చేస్తే త్రాగునీరు కలుషితం అవుతాయని అన్నారు. ఇప్పటి వరకు ఏ విఘ్నాలు లేకుండా మనం విజయవంతంగా అభివృద్ది చేసుకుంటున్నాం.. ఒక పని పూర్తి కాకముందే మరొక అభివృద్ది పనులకు నిధులు వస్తున్నాయి.. అదంత గణనాధుడు మన పై చల్లటి దీవెనలు, ఆశీర్వాదాలు ఉండటం వల్లే అన్నారు. పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో మట్టి వినాయక మండపం లకు ఉచిత పోలీస్ పెర్మిషన్, విద్యుత్ బిల్ పంపిణి.. స్తంబాద్రి ఉత్సవ సమితి అధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించే మండపం లకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో ఉచితంగా పోలీస్ పెర్మిషన్, విద్యుత్ ఛార్జీలు అందిస్తున్నమని అన్నారు. అందుకు గాను పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో రూ.4 లక్షల విలువైన చెక్కును విద్యుత్ ఎస్ఈ సురేందర్ కి చెక్కు ను అందజేశారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తాం: మంత్రి హరీష్

స్తంబాద్రి ఉత్సవ సమితి అధ్వర్యంలో ప్రతిష్టించే మట్టి విగ్రహాల మండపాలు విద్యుత్ , పోలీస్ పర్మిషన్ లు తనే స్వయంగా చెల్లిస్తున్న తరుణంలో వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు కమర్తపు మురళీ, కొత్తపల్లి నీరజ, దండా జ్యోతి రెడ్డి, కురాకుల వలరాజ్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర్ రావు, బత్తుల మురళీ, స్తంబాద్రి ఉత్సవ సమితి నిర్వాహకులు గెట్యాల విద్యా సాగర్, కన్నం ప్రసన్న కృష్ణా, ములగుండ్ల శ్రీహరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సాయి, కొల్లు పద్మ, ఆకుల మూర్తి, షకీన, విద్యుత్ ఏడీఈ రమేష్ తదితరులు ఉన్నారు.

== ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్ పై ప్రజల కోసం ఎర్పాటు ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణి చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. మున్సిపల్ కమిషనర్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళీ, ప్రశాంత లక్ష్మీ, టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు, ఆకుల మూర్తి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.