20 మంది విద్యార్థులపై తేనే తీగల దాడి విద్యార్థులకు గాయాలు
(గార్ల-విజయం న్యూస్)
. పాఠశాల సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఉన్న తేనె టీగలు విద్యార్థులను దాడి చేసిన విషాద సంఘటన గార్ల మండల కేంద్రంలోని స్థానిక నిర్మల హై స్కూల్ లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే… గార్ల మండల కేంద్రంలో నిర్మల హై స్కూల్లో మధ్యాహ్న భోజనం సమయంతో తేనె తెట్టు మీద ఉన్న ఈగలు ఒక్కసారిగా లేవడంతో ఆ సమీపంలో ఉన్న 20 మంది విద్యార్థులపై తేనెటీగలు దాడి చేయడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. తేనెటీగల దాడిలో తీవ్ర గాయాలైన విద్యార్థులు రాహూల్, శ్రావణ్, రోహన్, వంశీ కృష్ణ, సంతోష్ లను ప్రథమ చికిత్స నిమిత్తం హుటాహుటిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లి, చికిత్స చేయించారు.
also read :- గాడితప్పిన “సహాకార”0
please subscribe this chanel smiling chaithu