ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైరా సిఐ వసంత్ కుమార్..
తల్లాడ, జనవరి 3
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లోని ఎన్టీఆర్ నగర్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనా స్థలాన్ని వైరా సిఐ వసంత్ కుమార్ సోమవారం పరిశీలించారు.
also read;-వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు : మంత్రి కేటీఆర్
ఈ సందర్భంగా తల్లాడ పోలీసులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దగ్ధమైన ద్విచక్ర వాహన ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం పక్కన మామిడి తోటలు, చుట్టుపక్కల ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తల్లాడ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ, జేవియర్,హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ జలీల్, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.