Telugu News

విద్యా సంస్థల బస్సుల తనిఖీ – ఫిట్‌ నెస్‌ లేకుండా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్‌

మంచిర్యాల పట్టణంలోని పలు విద్యాసంస్థలకు చెందిన బస్సులను మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వివేకానందరెడ్డి బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో తనిఖీ చేశారు.

0

విద్యా సంస్థల బస్సుల తనిఖీ.

(మంచిర్యాల – విజయంన్యూస్)

డిసెంబరు 1:-  మంచిర్యాల పట్టణంలోని పలు విద్యాసంస్థలకు చెందిన బస్సులను మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వివేకానందరెడ్డి బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువీకరణ పత్రాలు, ఫిట్‌ నెస్‌ లేకుండా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్‌ చేసి యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య ఆదేశాల మేరకు విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశామని తెలిపారు.

విద్యాసంస్థల వాహనాలకు ఫిట్‌ నెస్‌ గడువు ముగిసినందున ఫిట్‌నెస్‌ టెస్టు చేయించుకోవాలని సూచిం చారు. కొవిడ్‌ కారణంగా చాలా కాలంగా వాహనాలు వాడకుండా ఉన్నందున టైర్లలో లోపాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఫిట్‌ నెస్‌కు వచ్చే ముందు వాహనం కండీషన్‌తో పాటు టైర్లను పరిశీలించి సరైన విధంగా ఉండేలా చూడాలని సూచించారు. అవసరమైతే టైర్లను మార్చుకోవాలని చెప్పారు.

పాఠశాలలు, కాలేజీ విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు కచ్చితంగా కండీషన్‌లో ఉండాలన్నారు.

యాజమాన్యాలు అశ్రద్ధ వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు రాము, రవి, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.

 

also read :- ఏజెన్సీ లో హై ఆలర్ట్ మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యాటన