Telugu News

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

== 4 లక్షల విలువగల వస్తువులు స్వాధీనం

0

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
== 4 లక్షల విలువగల వస్తువులు స్వాధీనం
== విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపిన ఎస్ఐ లింగంపల్లి భూమేష్
(మందమర్రి: విజయం న్యూస్)
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేేకే ఓ సి పి సమీపంలో అంతర్జిల్లా దొంగల ముఠా ను అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ తెలిపారు.ఆదివారం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కె సి పి సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం బెల్లంపల్లి వైపు వెళ్తున్న ఆటోని ఆపి, అందులో వారిని విచారించగా, గతంలో దొంగతనం చేసినటువంటి బంగారు నగలను వస్తువులను అమ్మడానికి బెల్లంపల్లి వెళుతున్నట్లు తెలిపారు.అనంతరం వారిని మందమర్రి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా,వారు మందమర్రి విద్యానగర్ చెందిన గుర్రాల పెద్ద భూమయ్య(25), ఆయన సతీమణి గుర్రాల సంధ్య లగా గుర్తించారు.దొంగతనాల్లో వారికి వచ్చిన వాటాలో బంగారు నగలు, నగదు,టివి, కొన్ని వస్తువులు వారి ఇంట్లో ఉన్నాయని, దొంగతనాలు చేయుటకు ఆటో(టిఎస్ 19టి 9695) ఉపయోగించే వారమని పోలీసులకు తెలపడంతో, పోలీసులు వారి ఇంటి నుండి వాటిని స్వాధీనం చేసుకున్నారు.పెద్ద భూమయ్య కూలిపని చేస్తూ, ఆటో నడుపుతూ జీవిస్తూ ఉండేవాడని,మద్యం త్రాగుడు,జల్సాలకు అలవాటుపడి,సంపాదించిన సంపాదనంతా అతని జల్సాలకే సరిపోక, దొంగతనం చేసి డబ్బులు సంపాదించి,

జల్సాగా బ్రతకాలని అనుకొని, 2016 సంవత్సరంలో స్నేహితులైన సిలివేరి శంకర్,గద్దేరాగడి కీ చెందిన కాల్వ శ్రీకాంత్ లతో కలిసి ఇనుప సామాన్లు దొంగలించే వారని, 2017 సంవత్సరంలో ముగ్గురు మాదారంలో దొంగతనం చేయగా, వారిని మందమర్రి పోలీసులు పట్టుకొని, జైలుకు పంపడం జరిగిందన్నారు.జైలు నుండి విడుదలైన అనంతరం ఇంటి వద్దనే ఉండి,అనంతరం దొంగతనం చేయాలని నిర్ణయించుకొని,పెద్ద భూమయ్య,అతనిభార్య సంధ్య, తమ్ముడు గుర్రాల చిన్న భూమయ్య, స్నేహితులు సిలివేరి శంకర్, సిలివేరి బ్రహ్మయ్య, మరికొంతమంది ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేసేవారని తెలిపారు.

విచారణలో నేరస్తులు తమ నేరాన్ని అంగీకరించారని తెలిపారు.వారి నుండి 4 లక్షల రూపాయల విలువ గల బంగారం,ఒక్క ఆటో,ఒక్క హోండా షైన్ బైక్,ఒక్క టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.వారిపై పెద్దపల్లి,మంచిర్యాల్,జగిత్యాల జిల్లాలోని, తొమ్మిది పోలీస్ స్టేషన్ లో 13 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.ఈసందర్భంగా దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ భూమేష్,పిఎస్ఐ మాలిక్, పోలీస్ సిబ్బంది బాలు, అజయ్,జంగు లను అభినందించి నగదు రివార్డు అంద చేశారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

also read:-కళామందిర్ షోరూం ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..