ఇంటర్ పరీక్షలు ప్రారంభం.
(ఏనుకూరు విజయం న్యూస్):-
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఏన్కూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. జూనియర్ కళాశాలలో 190 మంది విద్యార్థులకు గాను ఆరుగురు విద్యార్థులు హాజరు కాలేదు. ఒకేషనల్ పరీక్షకు 89 మంది గాను 9 మంది హాజరుకాలేదు బాలుర గురుకుల కళాశాలలో 232 మంది విద్యార్థులకు గాను 24 మంది పరీక్షకు హాజరు కాలేదు పరీక్షా కేంద్రాలు చీఫ్ సూపరింటెండెంట్ గా శ్రీనివాస రెడ్డి, సుందరం డిపార్ట్మెంట్ అధికారులు గా కృష్ణప్రసాద్,శ్రీనివాసులు వ్యవహరించారు. సిట్టింగ్ స్క్వాడ్ గా వెంకటముత్యం వ్యవహరించారు.